క్యాష్ షో ఈ టీవీలో చాలా పాపులర్. ఎంతో మంది సినిమా జనాలు ఈ షోకి వచ్చారు. బాలీవుడ్ స్టార్స్ కూడా. ఇప్పుడు ఆ షో కి ఫుల్ స్టాప్ పెట్టి, సుమ అడ్డా అనే కొత్త షో ను స్టార్ట్ చేసారు. దీనికి తొలి ఎపిసోడ్ గా సంతోష్ శోభన్ టీమ్ తో ఓ కార్యక్రమం చేసారు.
అయితే అది కాదు విషయం. రెండో ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి, డైరక్టర్ బాబీ హాజరు కావడం. బాబి సంగతి సరే, మెగాస్టార్ చిరు ఒక టీవీ గేమ్ షో లాంటి దానికి హాజరుకావడం కచ్చితంగా విశేషమే.
గతంలో ఆహాలో సమంత చాట్ షో కి చిరు హాజరయ్యారు. బట్ అక్కడ సమంత వుంది. అది చాట్ షో. కానీ సుమ చేస్తున్నది గేమ్ షో లాంటి అల్లరి సరదా వ్యవహారం. దీనికి తన సినిమా వాల్తేర్ వీరయ్య ప్రమోషన్ కోసం చిరంజీవి హాజరుకావడం అంటే నిజంగా గొప్ప విషయమే.
దీని వెనుక అసలు విషయం ఏమిటంటే ఈటీవీలో షోలు అన్నీ నిర్మించేది ఎక్కువగా ఒక్కరే. అది మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఆయనకు మెగాస్టార్ కు మాంచి అనుబంధం వుంది. డైరక్ట్ గా శ్యామ్ ప్రసాద్ రెడ్డి అడిగేసరికి చిరంజీవి కాదనలేకపోయారని తెలుస్తోంది. దాంతో సుమ షో కి ఏకంగా మెగాస్టార్ వచ్చేసి సందడి చేసారు. సంక్రాంతి సందర్భంగా ఈ షో ను ఈటీవీలో ప్రదర్శిస్తారు.