లైగర్ తరువాత దర్శకుడు పూరి జగన్నాధ్ ఏం చేస్తున్నారు..ఇది ఒక ప్రశ్న. వాల్తేర్ వీరయ్య తరువాత మెహర్ రమేష్ సినిమా మాత్రమే ప్లానింగ్ లో వుంది మెగాస్టార్ కు. ఆ తరువాత ఏమిటి అన్నది మరో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలకు ఒకటే సమాధానం వినిపిస్తోంది ఇండస్ట్రీలో.
మెగాస్టార్ కోసం పూరి జగన్నాధ్ కథ రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా వున్నారు. కొద్ది కాలం కిందటే మెగాస్టార్-పూరి మధ్య ముచ్చట వచ్చినపుడు, తనతో సినిమా అన్న దాన్ని ప్రస్తావించారు. ఆటో జానీ ఏమైంది అంటే అది కాదు..మరో మాంచి కథ రెడీ చేస్తున్నా అన్నారు పూరి.
ఇప్పుడు పూరి చేస్తున్న పని అదే. మెగాస్టార్ కోసం మాంచి స్క్రిప్ట్ రెడీ చేయడం. లైగర్ తరువాత పూరి తెలుగులో సినిమా చేయాలి అంటే అది సరైన సినిమా కావాల్సిందే. అన్ని విధాలా సరైన ప్రాజెక్టు అయితేనే ఏ తలకాయనొప్పలు లేకుండా వుంటుంది. పైగా టాలీవుడ్ లో వున్న అందరు హీరోలతో దాదాపుగా పూరి జగన్నాధ్ సినిమాలు చేసేసారు. ఇక మిగిలింది మెగాస్టార్ నే.
అందుకే ఇప్పుడు ఆ దిశగా పూరి జగన్నాధ్ తన ప్రయత్నాలు షురూ చేసినట్ల కనిపిస్తోంది. అందుకే మెగాస్టార్ కూడా కొత్త సినిమాలు ఏవీ ప్రకటించలేదు. వాల్తేర్ వీరయ్య రిజల్ట్ చూసిన తరువాతే కొత్త సినిమా సంగతి తెలుస్తుంది. అది పూరి సినిమానే కావచ్చు అని రూఢీగా తెలుస్తున్న సమాచారం.