మెగాస్టార్ కు అస్వస్థత ?

మెగాస్టార్ చిరంజీవి అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఖమ్మం జిల్లా ఇల్లెందు సమీపంలోనే ఓపెన్ కాస్ట్ గనుల్లో ఆచార్య షూటింగ్  జరుగుతోంది.  Advertisement షూటింగ్ ప్రారంభమై మూడు రోజులే అయింది. ఇంకో నాలుగు…

మెగాస్టార్ చిరంజీవి అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఖమ్మం జిల్లా ఇల్లెందు సమీపంలోనే ఓపెన్ కాస్ట్ గనుల్లో ఆచార్య షూటింగ్  జరుగుతోంది. 

షూటింగ్ ప్రారంభమై మూడు రోజులే అయింది. ఇంకో నాలుగు రోజలు జరగాల్సి వుంది. కానీ ఎండల తీవ్రత అధికంగా వుండడంతో, చిరంజీవి డీ హైడ్రేషన్ కు గురయ్యారని బోగట్టా. 

దాంతో అర్థాంతరంగా షూటింగ్ ఆపేసి యూనిట్ హైదరాబాద్ తిరిగివెళ్లిపోయింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా కోసం ఖమ్మం వచ్చారు. మంత్రి అజయ్ కుమార్ ఇంట్లో వుంటున్నారు.

నిన్నటికి నిన్న శ్రీకారం పంక్షన్ లో కూడా పాల్గొన్నారు. ఈ రోజు అక్కడ ఎండలు విపరీతంగా వున్నాయి. దాంతో ఆయన అలసటకు గురైనట్లు తెలుస్తోంది.

కొరటాల శివ డైరక్షన్ లో తయారవుతున్న ఆచార్య సినిమా మే నెలలో విడుదల కు షెడ్యూలు చేసి వుంది. కంటిన్యూగా షూటింగ్ చేస్తే తప్ప డేట్ కు విడుదల కావడం కష్టం. ఇలాంటి నేపథ్యంలో నాలుగు రోజుల షూటింగ్ రద్దయింది. 

ఇదిలా వుంటే ఇలా వినిపిస్తున్నవార్తలు అన్నీ వాస్తవం కాదని, మెగాస్టార్ ఫుల్ హ్యాపీగా, హెల్తీగా వున్నారని, బయటకు వచ్చిన వార్తలు నిరాధారమని మెగాస్టార్ వర్గాలు ఖండిస్తున్నాయి.

గాలి సంపత్.. F2 లాంటి కామెడీ సినిమా కాదు

సమాజాన్ని ఉద్ధరించడం కోసం శ్రీకారం తీయలేదు