వయసు మీద పడిన తరువాత మోకాలు సర్జరీ అన్నది కామన్. పైగా విపరీతంగా ఫైట్లు, జంప్ లు, డ్యాన్స్ లు చేసిన హీరోలకు మరీ కామన్. మెగాస్టార్ చిరు కూడా దీనికి అతీతం కాదు. ఆయనకు కూడా మోకాలు సమస్య వుందట.
చాలా రోజుల నుంచి ఆపరేషన్ పెండింగ్ లో వుంచుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇక చేయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆపరేషన్ హైదరాబాద్ లో చేయిస్తారా? లేదా విదేశాల్లోనా? కాకుంటే దేశంలోనే మరే నగరంలోనా అన్ని ఇంకా తెలియదు. ఆయనకు, ఆయన ఫ్యామిలీకి మాత్రమే ఈ సంగతి తెలుసు అని తెలుస్తోంది.
ఈ వారంలోనే సర్జరీ చేయించుకుని, సుమారు నెల, నెలన్నర విశ్రాంతి తీసుకుంటారని, ఆ తరువాతే మళ్లీ సినిమా మీదకు వస్తారని తెలుస్తోంది. ఇదిలా వుంటే భోళాశంకర్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ కావడం అన్నది మెగా క్యాంప్ కు ఓ షాక్ గా మారింది. రీజన్ ఏమిటి అన్నది ఇంకా అంతుపట్టలేదు. జబర్దస్త్ గ్యాంగ్ మొత్తాన్ని తీసుకోవడం వల్ల సినిమా కొంత వరకు స్థాయి తగ్గిందని ఓ అంచనాకు వచ్చారు.
ఇప్పుడు చేయబోయే సినిమా విషయంలో ఏం చేయాలి అన్నది ఇప్పుడు డిస్కషన్ లో వుంది. ప్రస్తుతానికి అయితే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. చిరు తన ఆపరేషన్, రెస్ట్ అన్నీ అయిన తరువాత ఈ సినిమా ఏం చేయాలి? ఎలా చేయాలి? యంగ్ హీరోను ఎవరిని తీసుకోవాలి అన్నది డిసైడ్ చేయాల్సి వుంటుంది. ఈ లెక్కన 2024 సమ్మర్ కు తప్ప మళ్లీ మెగాసినిమా వుండదు.