సామాన్యుల నిశ్చితార్ధాలే పెళ్లి వరకు వెళ్లడం లేదు. అలా వెళ్లినా ఎన్ని జంటలు ఎన్నాళ్లు జంటగా వుంటాయన్న క్లారిటీ లేదు. సొసైటీలో వచ్చిన మార్పు అది.
ఇక సెలబ్రిటీల సంగతి చెప్పనక్కరలేదు. కొన్ని నెలల క్రితం నిశ్చితార్ధం చేసుకున్న హీరోయిన్ మెహరీన్ కాబోయే భర్తకు బ్రేకప్ చెప్పేసింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించింది.
రాజకీయనాయకుడు భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ పెళ్లి ఫిక్స్ అయింది. రెండు కుటుంబాలు కలిసే ఫిక్స్ చేసాయి. నాలుగునెలల క్రితమే అంగరంగ వైభవంగా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి మెహరీన్ ఇలా ట్విట్టర్ లో నోట్ పెట్టడం సంచలనంగా మారింది.
ఇద్దరం కలిసి, స్నేహపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెహరీన్ వెల్లడించింది. ఇకపై భవ్య బిష్ణోయ్ తో కానీ, ఆయన కుటుంబసభ్యులతో కానీ తనకు ఎలాంటి సంబంధాలు లేవు అని క్లారిటీ ఇచ్చేసింది మెహరీన్. అంతే కాదు బిష్ణు స్నేహితులు, చుట్టాలతో కూడా ఎలాంటి సంబంధాలు లేవు అని ప్రకటించింది.
ఇకపై తన తన సినిమాలు, తన పెర్ ఫార్మెన్స్ మీద దృష్టి పెడతానని, అందరూ తన ప్రయివసీని గౌరవిస్తారని భావిస్తున్నా అని మెహరీన్ ట్వీట్ చేసింది.