హీరోయిన్ మెహ్రీన్ పొద్దున్నే సోషల్ మీడియాలోకొచ్చింది. 2 రోజులుగా తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టింది. కొత్తగా తను ఎలాంటి సినిమాలు కమిట్ అవ్వలేదని క్లారిటీ ఇచ్చింది.
త్వరలోనే బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. ఈ సినిమాలో మెహ్రీన్ ను తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ ప్రింట్ మీడియా కూడా ఈ వార్తలు ఇచ్చేసింది. దీంతో రంగంలోకి దిగిన మెహ్రీన్.. తను బాలయ్య సినిమాలో లేనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.
“ప్రస్తుతం మారుతి-సంతోష్ శోభన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటిస్తున్నాను. నా తదుపరి చిత్రంపై వస్తున్న ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదు. నేను ప్రకటించే వరకు నా సినిమాలపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు.”
ఇలా తను బాలయ్య సినిమా చేయడం లేదనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది మెహ్రీన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మారుతి సినిమాతో పాటు అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 చేస్తోంది.