ఇకపై తనను ఆ పేరుతో పిలుస్తారంటున్న మెహ్రీన్

చాన్నాళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న మెహ్రీన్ కు 2-3 సినిమాలు మాత్రమే గుర్తింపు తెచ్చిపెట్టాయి. వీటిలో ఒకటి ఎఫ్2 సినిమా. ఆ మూవీలో మెహ్రీన్ పోషించిన హనీ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఎక్కడికి…

చాన్నాళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న మెహ్రీన్ కు 2-3 సినిమాలు మాత్రమే గుర్తింపు తెచ్చిపెట్టాయి. వీటిలో ఒకటి ఎఫ్2 సినిమా. ఆ మూవీలో మెహ్రీన్ పోషించిన హనీ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా మెహ్రీన్ ను 'హనీ ఈజ్ బెస్ట్' అనే డైలాగ్ తో పిలుస్తుంటారు.

అయితే ఇకపై తనను హనీ అని కాకుండా, లేఖ అనే పేరుతో పిలుస్తారని చెబుతోంది మెహ్రీన్. స్పార్క్ అనే సినిమాలో ఆమె పోషించిన పాత్ర పేరు అది. తనకు ఈ సినిమా లైఫ్ టైమ్ గుర్తింపు తెచ్చిపెడుతుందని భావిస్తోంది ఈ బ్యూటీ.

“స్పార్క్ మూవీలో నేను లేఖ పాత్రలో కనిపిస్తాను. ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న రోల్ నాది. సినిమా నాతోనే స్టార్ట్ అవుతుంది. నాతోనే ఎండ్ అవుతుంది. ఇలాంటి థ్రిల్లర్‌లో నటించటం నాకు కూడా కొత్తగా అనిపించింది. నేను ఏదైనా ఈవెంట్స్‌కి వెళ్లినప్పుడు, నా సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నప్పుడు ఎవరైనా నా క్యారెక్టర్ పేరుతో నన్ను పిలిస్తే నాకెంతో హ్యాపీగా ఉంటుంది. అదే నాకు స్పార్క్ మూమెంట్‌గా అనిపిస్తుంది.”

నిన్నమొన్నటివరకు తనను హనీ, మహాలక్ష్మి లాంటి పేర్లతో పిలిచారని, ఇకపై తనను లేఖ అంటూ పిలుస్తారని నమ్మకంగా చెబుతోంది మెహ్రీన్. ఈ సినిమాపై ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. ప్రస్తుతం మెహ్రీన్ చేతిలో ఉన్న అతికొద్ది సినిమాల్లో ఇదొకటి. 

తమిళ్ లో ఈమె ఓ సినిమా చేస్తోంది. స్పార్క్ టైపులో అది కూడా థ్రిల్లర్ మూవీనే అని చెబుతోంది. తనకు ఈ రెండు సినిమాలు కచ్చితంగా సక్సెస్ తెచ్చి పెడతాయని ఆశిస్తోంది మెహ్రీన్.