Advertisement

Advertisement


Home > Movies - Movie News

జూనియర్ జాతిరత్నాలు..మేమ్ ఫేమస్

తెలంగాణ టౌన్ బ్యాక్ డ్రాప్ లో ముగ్గురు అల్లరి చిల్లరి కుర్రాళ్ల కథ ను జాతిరత్నాలు గా మార్చి హిట్ కొట్టాడు అనుదీప్. ఇప్పుడు మళ్లీ అలాంటి సరదా సంగతులు గుర్తు చేస్తోంది ఈ రోజు విడుదల చేసిన ‘మేమ్ ఫేమస్’ అనే చిన్న సినిమా టీజ‌ర్. 

చాయ్ బిస్కట్..లహరి సంస్థలు నిర్మించిన సినిమా ఇది. రైటర్ పద్మభూషణ్ తరువాత వస్తున్న సినిమా. ఈ సినిమా టీజ‌ర్ ను మంత్రి మల్లారెడ్డి విడుదల చేసారు.

టీజ‌ర్ ఎంత మాత్రం నవ్వులు పండించలేదనే చెప్పాల్సిందే. జాతిరత్నాలు అడుగు జాడలు కొంత కనిపించాయి. త్వరలో రాబోతున్న పరేషాన్ అనే బుల్లి సినిమా కంటెంట్ కొంచెం పాలిష్ చేస్తే అన్నట్లు అనిపిస్తుంది. ఈ అడుగు జాడలు, పాలిష్ సంగతి ఎలా వున్నా, నవ్వులు పండించడంలో, లేదా ఫస్ట్ ఇంపాక్ట్ కలిగించడంలో టీజ‌ర్ మాత్రం అంత సక్సెస్ సాధించడం కష్టమే కావచ్చు.

కంటెంట్ ఇంకా ఇంకా వుండి, మరిన్ని అప్ డేట్ లు వస్తే అప్పుడు సినిమా గురించి ఓ ఐడియా రావచ్చు. ఇప్పటికి అయితే టీజ‌ర్ మాత్రమే కనుక ఫైనల్ జ‌డ్ఙిమెంట్ ఇచ్చేయలేం. ఇంట్రస్టింగ్ గా పబ్లిసిటీ మెటీరియల్ అందించడంలో చాయ్ బిస్కట్ కు ఎక్సపెర్టైజ్ వుంది. కానీ ఇక్కడ ఎందుకో కాస్త తగ్గిందనే చెప్పాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?