ఫాలోవర్స్ తగ్గుతున్నారని ఆత్మహత్య

ఈమధ్య ఆత్మహత్యలు చేసుకోవడానికి పెద్దగా కారణాలు వెదకడం లేదు యువత. క్షణికావేశంలో చిన్న చిన్న రీజన్స్ కే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లి సెల్ ఫోన్ ఇవ్వడం లేదని కూతురు ఆత్మహత్య చేసుకున్న…

ఈమధ్య ఆత్మహత్యలు చేసుకోవడానికి పెద్దగా కారణాలు వెదకడం లేదు యువత. క్షణికావేశంలో చిన్న చిన్న రీజన్స్ కే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లి సెల్ ఫోన్ ఇవ్వడం లేదని కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇది కూడా దాదాపు అలాంటిదే.

కంటెంట్ క్రియేటర్ మిషా అగర్వాల్ ఆత్మహత్య చేసుకుంది. సరిగ్గా తన 25వ పుట్టినరోజుకు 2 రోజుల ముందు ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఇంతకీ ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలుసా? ఇనస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారట.

మీరు చదివింది నిజమే.. ఇనస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారనే ఆందోళనలో ప్రాణాలు తీసుకుంది మిషా. ఈ విషయాన్ని స్వయంగా ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.

నిత్యం ఇనస్టాగ్రామ్ లో మునిగితేలుతుంది మిషా. అదే ఆమె లోకంగా మారింది. ఎలాగైనా మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తన టార్గెట్ నే ఫోన్ స్క్రీన్ లాక్ గా కూడా పెట్టుకుంది.

అయితే ఫాలోవర్స్ పెరగాల్సింది పోయి, తగ్గడం మొదలైంది. దీన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఒక దశలో తన సోదరితో కూడా తన ఆందోళనను పంచుకుంది. తను ఎందుకూ పనికిరానని బాధపడింది. అంతలోనే ప్రాణాలు తీసుకుంది. ఎల్ఎల్బీ చదివి లాయర్ అవుతుందనుకున్న తమ బిడ్డ ఇనస్టా మత్తులో పడి ప్రాణాలు తీసుకుందని, ఆమె తల్లిదండ్రులు వెల్లడించారు.

5 Replies to “ఫాలోవర్స్ తగ్గుతున్నారని ఆత్మహత్య”

  1. నువ్వు చవట్లేదేంట్రా ? ఇంత మంది ఎన్ని బూతులు తిడుతున్నా సిగ్గు లేకుండా బతికేస్తున్నావ్ . ఇష్టమొచ్చింది రాస్తున్నావ్. ఆ అమ్మాయికి నీ గురించి తెలిసి ఉంటే ఇంత పని చేసేది కాదు . ఎందుకంటే తెలుసు గా నీ బతుకేంటో..

Comments are closed.