2 రోజులుగా చక్కర్లు కొట్టిన పుకారు ఇది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఎదిగి, అట్నుంచి అటు హాలీవుడ్ కు కూడా ప్రభాస్ వెళ్లబోతున్నాడంటూ అతడి అభిమానులు ఊదరగొట్టారు. ప్రతిష్టాత్మక మిషన్ ఇంపాజిబుల్-7 మూవీలో టామ్ క్రూస్ తో కలిసి ప్రభాస్ నటించబోతున్నాడంటూ ప్రచారం చేశారు. అయితే ఇందులో నిజం లేదు.
ఇటలీలో రాధేశ్యామ్ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు మిషన్ ఇంపాజిబుల్-7 దర్శకుడు క్రిస్టోఫర్ మెక్ క్వారీతో ప్రభాస్ కథా చర్చలు జరిపాడని.. సినిమాలో ఓ పాత్రలో నటించేందుకు అంగీకరించాడని కథనాలు వచ్చాయి. వీటిపై స్వయంగా దర్శకుడు క్రిస్టోఫర్ స్పందించాడు.
తమ సినిమాలో ప్రభాస్ నటించడం లేదని, తాము ఇప్పటివరకు కలుసుకోలేదని స్పష్టంచేశాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. రాధేశ్యామ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. సలార్, ఆదిపురుష్ షూటింగ్ స్టేజ్ లో ఉన్నాయి. వీటి తర్వాత నాగ్ అశ్విన్ సినిమా చేయాలి.
ఇలాంటి టైమ్ లో హాలీవుడ్ సినిమాలో ప్రభాస్ నటిస్తే.. ఈ సినిమాలన్నీ ఇంకాస్త వెనక్కి వెళ్లిపోతాయి. ఎందుకంటే, హాలీవుడ్ ప్రాజెక్టుకు టైమ్ ఎక్కువ కేటాయించాల్సి వస్తుంది. కానీ “ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ” అనేది కేవలం పుకారు మాత్రమే.