లియో.. భగవంత్ కేసరి.. టైగర్ నాగేశ్వరరావు.. పోటాపోటీగా విడుదలయ్యాయి. నిజానికి ఈ పోటీ కొంత వరకు అవాయిడ్ చేయగలిగిందే. కానీ ఎవరికి వారు బిగుసుకుపోయారు. లియో సినిమా అన్నది తెలుగునాట ఇంత భారీ రిలీజ్ వుంటుందని ముందుగా అనుకోలేదు. వేరే వాళ్లు కొని వుంటే ఏమో కానీ సితార సంస్థ కొనడంతో బాలయ్య సినిమాతో పోటా పోటీగా విడుదలకు నోచుకుంది. సరే, మొత్తం మీద మూడు సినిమాలు విడుదలయ్యాయి. టాక్ సంగతి అలా వుంచితే తొలివారం తరువాత ఫైనాన్షియల్ గా పరిస్థితి ఏమిటి?
లియో సినిమా డబ్బింగ్ కనుక ఆంధ్ర 9 కోట్ల రేషియోలో మార్కెట్ చేసారు. సీడెడ్ కూడా విక్రయించగా చాలా నామినల్ మొత్తానికి నైజాం మిగిలింది. తొలివారంతో ఆంధ్ర, సీడెడ్ దాదాపుగా బ్రేక్ ఈవెన్ కు చేరుకున్నాయి. కమిషన్లు వచ్చినా రాకున్నా, బయ్యర్లు దాదాపు సేఫ్ అనుకోవాలి. నైజాంలో వచ్చే ఆదాయంలో సితార సంస్థ కూడా కాస్త లాభమే చేసుకుంది.
టైగర్ నాగేశ్వరరావు కు ఖర్చు తక్కువ. డెభై నుంచి ఎనభై కోట్ల లోపు ఖర్చు చేసారు. నాన్ థియేటర్ మీదే 65 కోట్లు వచ్చేసింది. సినిమాను ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఓవర్ సీస్, అదర్ ఏరియాల మీద కొంత ఆదాయం వచ్చింది. మిగిలినది రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మీద దగ్గర దగ్గరగా వచ్చేసినట్లే.
భగవంత్ కేసరి సమస్య ఏమిటంటే సినిమా నిర్మాణానికే అన్నీ కలిపి 130 కోట్ల మేరకు ఖర్చు అయింది. థియేటర్ మీద 55 కోట్ల మేరకు బర్డెన్ పడింది. అందువల్ల తొలివారంలో అరవై నుంచి డెభై శాతం వరకు మాత్రమే రికవరీ వచ్చింది. మలివారం మీద ఇంకో ముఫై నలభైశాతం భారం వుంది. అయితే లక్ ఏమిటంటే ఈ శని, ఆదివారాలకు కూడా ఇదే సినిమా కావడం. మరే సినిమా బలంగా లేకపోవడం. అందువల్ల మరో ఇరవైశాతం రికవరీ వస్తే, బయ్యర్లు జఎస్టీతో కలిపి రికవరీ అయిపోతారు.
వచ్చే వారం చిన్న సినిమాలు చాలా వున్నాయి థియేటర్లలోకి రావడానికి. అందువల్ల అప్పుడు ఎలా వుంటుందో చూడాలి.