రాజు గారి మరణం నన్ను కలచివేసింది: మోదీ

టాలీవుడ్ దిగ్గ‌జ న‌టుల్లో ఒక‌రైన కృష్ణం రాజు మ‌ర‌ణంతో యావ‌తూ దేశంలో ప్ర‌ముఖులు అంద‌రూ సంతాపం తెలియ‌జేశారు. సిని న‌టులుగానే కాకుండా రాజ‌కీయ నాయకుడుగా, మాజీ మంత్రిగా దేశం కొసం, సిని ప‌రిశ్ర‌మ కోసం…

టాలీవుడ్ దిగ్గ‌జ న‌టుల్లో ఒక‌రైన కృష్ణం రాజు మ‌ర‌ణంతో యావ‌తూ దేశంలో ప్ర‌ముఖులు అంద‌రూ సంతాపం తెలియ‌జేశారు. సిని న‌టులుగానే కాకుండా రాజ‌కీయ నాయకుడుగా, మాజీ మంత్రిగా దేశం కొసం, సిని ప‌రిశ్ర‌మ కోసం చేసిన సేవ‌ల‌ను పార్టీల‌కు అతితంగా గుర్తుకు చేసుకంటూన్నారు.

కృష్ణంరాజు మరణం ప్రధాని నరేంద్రమోదీని కదిలించింది. ''ట్విట్టర్ లో ప్రత్యేకంగా ప్రధాని మోదీ తీవ్ర సంతాపం తెలియజేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటు తనను కలుసుకున్నప్పటి ఫొటోను జత చేశారు. శ్రీ యూవీ (ఉప్పల పాటి వెంకట) కృష్ణంరాజు గారు అకస్మాత్తుగా కాలం చేశారు. ఆయన సినిమా ప్రదర్శన, సృజనాత్మకతను తదుపరి తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. సామాజిక సేవలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. రాజకీయ నాయకుడిగా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి'' అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

అంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్విట్టర్ లో సంతాపం తెలియ‌జేశారు. “కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబ‌ల్ స్టార్‌ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. కృష్ణంరాజు గారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా”. అంటూ ట్వీట్ చేశారు.

మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న ట్విట్టర్ లో కృష్ణం రాజు గురించి… “ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ కృష్ణంరాజు గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన కృష్ణంరాజు గారు, రాజకీయాలలో కూడా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారు. ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను”. అంటూ ట్వీట్ చేశారు.

సిని ప్ర‌ముఖుల‌తో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ ప్ర‌ముఖులు కృష్ణం రాజు కుటుంబ స‌భ్యులకు త‌మ సంతాప‌ని వ్య‌క్తం చేశారు.