గత కొన్ని రోజులుగా మంచు మోహన్‌బాబు కుటుంబంలో వివాదం నడుస్తోంది. ఈ వివాదంలోకి తాజాగా మోహన్‌బాబు భార్య నిర్మల తెరపైకి రావడం గమనార్హం. పహాడీషరీఫ్ పోలీసులకు రాసిన లేఖ తీవ్ర దుమారం రేపుతోంది. చిన్న కుమారుడు మనోజ్‌కు ఆమె లేఖ గట్టి షాక్ ఇచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్మల పోలీసులకు లేఖ రాయడానికి దారి తీసిన పరిస్థితి, అలాగే అందులో ఏముందో తెలుసుకుందాం.
ఈ నెల 14న నిర్మల పుట్టిన రోజు. కుటుంబ సభ్యులు ఆమె పుట్టిన రోజును వేడుకగా నిర్వహించారు. అయితే ఆ రోజు రాత్రి తన అన్న విష్ణు, అతని అనుచరులు ఉద్దేశపూర్వకంగా కరెంట్ లేకుండా చేసి, చంపడానికి ప్రయత్నించారంటూ సంచలన ఆరోపణ చేశారు. జనరేటర్‌లో చక్కెరతో కలిపిన డీజిల్‌ను పోసి, దాని వల్ల అర్ధరాత్రి కరెంట్ లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యామని మనోజ్ ఆరోపించారు. ఆ సమయంలో తన తల్లి నిర్మల, తొమ్మిది నెలల తన కుమార్తె, అలాగే బంధువులు ఉన్నట్టు అతను పేర్కొన్నారు. తన అన్నతో పాటు అనుచరులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారాయన.
ఈ నేపథ్యంలో నిర్మల ఘాటుగా స్పందించారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో నిర్మల వివరిస్తూ పోలీసులకు లేఖ రాశారు. తన చిన్న కుమారుడు మనోజ్ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని నిర్మల తేల్చి చెప్పారు. తన పుట్టిన రోజు సందర్భంగా పెద్ద కుమారుడు విష్ణు జల్‌పల్లిలలోని ఇంటికి కేక్ తీసుకొచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నామన్నారు.
అయితే విష్ణు గొడవ చేసినట్టు మనోజ్ వేసిన అభాండాల్లో ఎంత మాత్రం నిజం లేదని నిర్మల వెల్లడించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తనకు తెలిసిందని, కానీ అందులో నిజం లేదని నిర్మల పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కేక్ కట్ చేసిన తర్వాత విష్ణు తన రూమ్‌లో ఉన్న సామాను తీసుకున్నట్టు నిర్మల వెల్లడించారు.
తన ఇద్దరు కుమారులకు ఇంట్లో సమాన హక్కులున్నాయని నిర్మల తెలిపారు. మనోజ్ ఫిర్యాదులో నిజం లేనే లేదన్నారామె. ఇంటి పనిమనుషులు పని చేయలేమని వెళ్లిపోవడం వెనుక విష్ణు ప్రమేయం ఏ మాత్రం లేదని నిర్మల రాసిన లేఖలో స్పష్టం చేశారు. తల్లే తన ఫిర్యాదులో నిజం లేదని ఏకంగా పోలీసులకు లేఖ రాసిన నేపథ్యంలో మనోజ్ స్పందన ఏంటో చూడాలి.
May be she is compelled to write that letter.. !!!
Yendhi annaa makkeee thalanopi
tandri ki tagga tanayulu