మోనిటర్ ముందు పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో ఓ నటుడు మాత్రమే కాదు స్ట్రిప్ట్ రైటర్, డైరక్టర్ కూడా వున్నారు. గతంలో ఓ విఫల ప్రయోగం కూడా చేసారు. ఇప్పుడు ఆయన అటు రాజకీయాల్లో, అటు…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో ఓ నటుడు మాత్రమే కాదు స్ట్రిప్ట్ రైటర్, డైరక్టర్ కూడా వున్నారు. గతంలో ఓ విఫల ప్రయోగం కూడా చేసారు. ఇప్పుడు ఆయన అటు రాజకీయాల్లో, అటు సినిమాల్లో ఫుల్ బిజీగా వున్నారు.

క్రిష్, వేణు శ్రీరామ్ లాంటి డైరక్టర్లు కూడా ఆయనను వీలయినంత ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, తక్కువ సమయంలో ఎక్కువ షూటింగ్ కానిచ్చేస్తున్నారని టాక్ వుంది. . నాలుగు కెమేరాలు చుట్టూ పెట్టి చకచకా హావ భావాలు క్యాచ్ చేస్తున్నారని వార్తలు వున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ మీద మాత్రం పవన్ చాలా శ్రద్ద చూపిస్తున్నారని తెలుస్తోంది. షాట్ లో తన నటన పూర్తి కాగానే మోనిటర్ ముందు కూర్చుని, అంతా చూసుకుని, ఇలా కాదు అలా చేద్దాం, ఇంకా ఇంప్రూవ్ చేద్దాం అనే కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారని తెలుస్తోంది. 

ఓ సీన్ లో రానా గట్టిగా పవన్ ను దబాయించాల్సి వుంది. దానికి రానా కాస్త లైట్ గా చేస్తుంటే, 'అలా కాదు. ఇక్కడ నేను డౌన్ అవ్వాలి..నువ్వ హై అవ్వాలి..ఇంకా గట్టిగా దబాయించు' అని చెప్పి మరీ సీన్ ను రీటేక్ చేయించారట. సినిమా సెట్ లో ఇలా మారిపోయిన పవన్ ను చూసి యూనిట్ అంతా కొత్తగా ఫీల్ అవుతోందని బోగట్టా.

బహుశా తన నటన ఎక్కడ తేడా వస్తే, మాతృకతో పోల్చుకుని విమర్శలు కురిపిస్తారో అని పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? లేక సినిమా డైరక్షన్ మీద ఆయనకు వున్న ఆసక్తి మళ్లీ బయటకు వస్తోందా? ఏమో?

చెవుల్లో పూలు పెట్టించుకునేంత అమాయకులా జనం

తెలంగాణలో రాజన్న రాజ్యం