cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరోలకు ఆర్కే చురకలు

హీరోలకు ఆర్కే చురకలు

ఎబిఎన్ ఆర్కే వారం వారం చేసే సుభాషితాల కార్యక్రమం గురించి తెలుసుగా..కొత్త పలుకు అంటూ ఆయన ఏవేవో పలుకుతుంటారు. ఈవారం పలుకులో తెలుగు సినిమా జనాలకు చురక వేసారు. 

''...హైదరాబాద్‌లో నివసిస్తున్న చిత్ర పరిశ్రమ ప్రముఖులు సైతం విశాఖ ఉక్కు కోసం గొంతెత్తకపోవడం గమనార్హం. ఇదే సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కనుసైగ చేస్తే చాలు ‘మేము సైతం’ అని రంగంలోకి దిగుతారు. కేసీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపునివ్వడంతో సినీ ప్రముఖులు పోటీ పడి మరీ మొక్కలు నాటి ఫొటోలు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అంటే మాత్రం అందరికీ లోకువే! ....''

ఆర్కే ఆవేదనలో నిజం వుందనిపిస్తుంది. హైదరాబాద్ లో సినిమా జనాలు ఇఫ్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ నేతలను సదా పొగిడే పనిలో వున్నారు. అది ఎంత మాత్రం తప్పుకాకపోవచ్చు. కానీ ఆంధ్ర అన్నా, ఆంధ్ర ప్రభుత్వం అన్నా, అక్కడి నేతలు అన్నా అస్సలు పట్టదు. 

నిజానికి జగన్ ను సినిమా జనాలు అస్సలు పట్టించుకోకున్నా, ఆయన ఏమీ ఫీలవ్వలేదు. జగన్ నిజంగా ఈ సినిమా జనాల వ్యవహారం చూసి కాస్త గట్టిగా పట్టించుకుంటే వీరి ఆటలు సాగవు.

గట్టిగా థియేటర్ల మీద కన్నేస్తే అసలు లెక్కలు బయటకు వస్తాయి. గట్టిగా పట్టుకుంటే అదనపు ఆటలు, అదనపు రేట్లు అనే ఆటలు కట్టవుతాయి. అంతెందుకు అంత అర్జెంట్ గా 100 పర్సంట్ ఆక్యుపెన్సీ వచ్చేదే కాదు. కానీ సినిమా జనాల వ్యవహారాలను జగన్ పట్టించుకోరు. అందుకే వీరి వైఖరి అలా సాగిపోతోంది అనుకోవాలి. 

ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి ఆర్కే సినిమా జనాలను దెప్పి పొడిచారు. గతంలో బాబు గారి కోసం ఇదే సినిమా జనాలు లగెత్తుకు వచ్చిన సంగతి మరచిపోయారేమో? అదే విధంగా అమరావతి, స్టీల్ ప్లాంట్ కోసం రావడం లేదని ఆయన బాధేమో?

చెవుల్లో పూలు పెట్టించుకునేంత అమాయకులా జనం

తెలంగాణలో రాజన్న రాజ్యం

 


×