మూడు సినిమాలు-ముఫై కోట్లు

టాలీవుడ్ లో అంతే ఒక్క సరైన హిట్ చాలు..ఓ రేంజ్ అదే వెదుక్కుంటూ వచ్చేస్తుంది. అలాగే ఒక్క ఫ్లాప్ చాలు. కిందకు లాగేస్తుంది. సవ్యసాచి సినిమాతో దర్శకుడు చందు మొండేటి పని అయిపోయింది అనుకున్నారంతా.…

టాలీవుడ్ లో అంతే ఒక్క సరైన హిట్ చాలు..ఓ రేంజ్ అదే వెదుక్కుంటూ వచ్చేస్తుంది. అలాగే ఒక్క ఫ్లాప్ చాలు. కిందకు లాగేస్తుంది. సవ్యసాచి సినిమాతో దర్శకుడు చందు మొండేటి పని అయిపోయింది అనుకున్నారంతా. కానీ తనను ఇండస్ట్రీలోకి తీసుకువచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ ను కష్టపడి తీసి, అద్భుతమైన హిట్ కొట్టాడు. ఇలాంటి అలాంటి హిట్ కాదు. చందు ను ఆఫర్లు వెదుక్కుంటూ వచ్చాయి.

కానీ గీతా కాంపౌండ్ చందును తన దగ్గరకు తీసేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సినిమాలు చందుతో చేసేందుకు గీతం సంస్థ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మూడు సినిమాలకు కలిపి ముఫై కోట్ల రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 

సూర్యతో ఒక సినిమా, బాలీవుడ్ లో మరో సినిమా అన్నది ముందుగా వున్న ప్లాన్. కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాలకు చైతన్య సినిమా కూడా తోడయ్యేలా వుంది.

మొన్నటికి మొన్న ఓ సభలో అల్లు అరవింద్ కూడా చందు మీద ప్రశంసలు కురిపించారు. ఎన్ని ఆఫర్లు వచ్చినా తమకు ఇచ్చిన మాట కు కట్టుబడి చందు అలా వుండిపోయాడని అన్నారు. ఆ అభిమానంతోనే కావచ్చు. ఇలా మూడు సినిమాలకు ముఫై కోట్ల ఆఫర్ ఇచ్చి వుంటారు.