cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

శ్రుతిహాస‌న్ కు డిమాండ్ అస్స‌లు త‌గ్గ‌ట్లే!

 శ్రుతిహాస‌న్ కు డిమాండ్ అస్స‌లు త‌గ్గ‌ట్లే!

మొద‌ట్లో ఐర‌న్ లెగ్ ముద్ర ప‌డినా.. ఆ త‌ర్వాత మాత్రం శ్రుతి హాస‌న్ కెరీర్ గాడిన ప‌డింది. అలా గాడిన ప‌డిన త‌ర్వాత కూడా శ్రుతి చ‌క‌చ‌కా సినిమాలు చేసుకొంటూ పోవ‌డం లేదు. కొన్నాళ్లు బాలీవుడ్ డ్రీమ్స్ తో అటు వైపు వెళ్లింది. ఆ త‌ర్వాత వ్య‌క్తిగ‌త జీవితంతో బిజీ అయిపోయింది. సినిమాల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టింది!

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌న్న‌ట్టుగా చాలా మంది హీరోయిన్లు వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. అయితే  త‌ను ఎంతైనా  క‌మ‌ల్  హాస‌న్  కూతురు  అన్న‌ట్టుగా.. కెరీర్  పీక్స్ లో ఉన్న‌ప్పుడు సినిమాల‌కు బ్రేక్ ఇచ్చింది శ్రుతి. బాయ్ ఫ్రెండ్ తో బిజీ అయ్యింది, పెళ్లే నెక్ట్స్ అనుకున్నాకా.. బ్రేక‌ప్ అనేసింది.

ఆ త‌ర్వాత  మ‌ళ్లీ ఇప్పుడు సినిమాల‌కు ఓకే చెబుతూ ఉంది.  ఇంత‌లో ర‌వితేజ  స‌ర‌స‌న ఒక సినిమాకు శ్రుతిని ఎంచుకున్నారు. ఇప్పుడు మ‌రింత ఆస‌క్తిదాయ‌క‌మైన విష‌యం ఏమిటంటే.. మ‌హేశ్ బాబు నెక్ట్స్ లో కూడా శ్రుతి హాస‌నే హీరోయిన్ అని వార్త‌లు వ‌స్తున్నాయి.

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ హీరోగా రూపొందే సినిమాలో శ్రుతి హాస‌న్ హీరోయిన్ అని స‌మాచారం. ఇది వ‌ర‌కూ మ‌హేశ్ తో శ్రుతి శ్రీమంతుడులో న‌టించింది. అలా సూప‌ర్ హిట్ పెయిర్ గా నిలిచింది ఈ జంట‌.

ఒక‌వైపు చాలా మంది హీరోయిన్లు మ‌హేశ్ స‌ర‌స‌న అవ‌కాశం కోసం వేచి చూస్తూ ఉంటారు.అయితే శ్రుతికి మాత్రం ఆ ఆఫ‌ర్ వెదుక్కొంటూ వెళ్లిన‌ట్టుంది. టాలీవుడ్ ను హీరోయిన్ల కొర‌త వేధిస్తున్న త‌రుణంలో శ్రుతి ఓకే అంటూ పోతే మ‌రిన్ని భారీ ప్రాజెక్టుల‌కు కూడా ఆమె కేరాఫ్ కానుంద‌ని స్ప‌ష్టం అవుతోంది.