‘మోసగాళ్ల బతుకింతే’

మనని ఇబ్బంది పెట్టిన వాళ్లు ఇబ్బంది పడితే మన ఆనందం మామూలుగా వుండదు. మానవ నైజం ఇది. దీనికి ఎవర్నీ తప్పు పట్టే పని లేదు. Advertisement హీరోయిన్ సమంత..హీరో నాగ్ చైతన్య విడిపోయారు.…

మనని ఇబ్బంది పెట్టిన వాళ్లు ఇబ్బంది పడితే మన ఆనందం మామూలుగా వుండదు. మానవ నైజం ఇది. దీనికి ఎవర్నీ తప్పు పట్టే పని లేదు.

హీరోయిన్ సమంత..హీరో నాగ్ చైతన్య విడిపోయారు. అధికారికంగా ప్రకటించేసారు. ఇదే టైమ్ లో సమంత మాజీ లవర్ సిద్దార్థ ఓ ట్వీట్ వేసారు. 

One of the first lessons I learnt from a teacher in school… “Cheaters never prosper.”

ఇదీ ఆ ట్వీట్. సిద్దార్ధ-సమంతల వ్యవహారం అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో ఇద్దరి పెళ్లి పక్కా అనుకున్నారు. సమంత కొన్నాళ్ల పాటు సిద్దార్థ ఇంట్లోనే వుండేదని వార్తలు వచ్చాయి. ఆ ఇద్దరు కలిసి శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజులు జరిపిన ఫొటోలు అప్పట్లో తెగ తిరిగాయి. కానీ అంతలోనే ఏమయిందో మరి వారిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు.

ఆ తరువాత సమంత పెళ్లి చైతూతో జరిగింది. ఇప్పుడు సిద్దార్ధ నర్మ గర్భంగా ఈ ట్వీటు వేయడం విశేషం. సోషల్ మీడియా జనాలు చిన్న పిల్లలు కాదు, విషయం అర్థం కాకపోవడానికి. 

సమంత-చైతూ ల విషయంలో ఇప్పటికే ఆమెనే తప్పు పడుతున్నారు. ఇప్పుడు ఈ ట్వీటుతొ అది మరింత పెరిగింది.