ఉమ్మడి ఏపీని అడ్డగోలుగా విభజించిన దానికో కాంగ్రెస్ తో పాటు బీజేపీకి కూడా సమాన భాగం ఉందని ఆప్ అంటోంది. బీజేపీ నాడు విభజనకు చూపిన ఉత్సాహం ఏపీ పునరుద్ధరణకు చూపకపోవడం దారుణమని ఆప్ విజయనగరం జిల్లా కన్వీనర్ దయానంద్ అన్నారు.
బీజేపీ ఏపీకి న్యాయంగా, చట్టపరంగా రావాల్సిన అన్ని హామీలను తుంగలోకి తొక్కేసిందని ఆయన మండిపడ్డారు. విభజన హమేఎలను అటకెక్కించిన బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఇవ్వకుండా చేస్తున్నారని అన్నారు.
అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్రా జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి ఊసు పూర్తిగా మరచిపోయారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు కోసం పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు.
ఈ విషయంలో ఏపీలోని రాజకీయ పార్టీలు కూడా భాగస్వాములు కావాలని, కేంద్రాన్ని డిమాండ్ చేసి అంతా సాధించుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు.
మొత్తానికి బీజేపీ ఏపీకి సంబంధించి ఏదైతే వినకూడదు అనుకుంటుందో ఆ ప్రత్యేక హోదా హామీని ఏదో రూపంలో విపక్షాలు ప్రస్థావించడమే ఇక్కడ విశేషం. మరి హోదా మీద బీజేపీ ఏం చెబుతుంది అన్నది కూడా ఆసక్తికరమే.