గోపీచంద్ జీవితంలో డిసప్పాయింట్ చేసిన సినిమా

ప్రతి హీరోకు కొన్ని హిట్స్ ఉంటాయి, కొన్ని ఫ్లాప్స్ ఉంటాయి. అదే టైమ్ లో బాగా హిట్టవుతుందని భావిస్తే, ఫ్లాప్ అయ్యే సినిమాలు కూడా ఉంటాయి. గోపీచంద్ కెరీర్ లో కూడా అలాంటి ఓ…

ప్రతి హీరోకు కొన్ని హిట్స్ ఉంటాయి, కొన్ని ఫ్లాప్స్ ఉంటాయి. అదే టైమ్ లో బాగా హిట్టవుతుందని భావిస్తే, ఫ్లాప్ అయ్యే సినిమాలు కూడా ఉంటాయి. గోపీచంద్ కెరీర్ లో కూడా అలాంటి ఓ సినిమా ఉంది. అయితే అది కేవలం తన కెరీర్ లోనే కాదని, తన జీవితంలోనే బాధించిన సినిమాగా చెప్పుకొచ్చాడు గోపీచంద్.

గోపీచంద్ ను బాగా బాధించిన సినిమా గౌతమ్ నందా. జీవితంలో ఎప్పుడూ ఏ సినిమాపై అన్ని ఆశలు పెట్టుకోలేదని, గౌతమ్ నందాపై మాత్రం భారీగా ఆశలు పెట్టుకున్నట్టు వెల్లడించాడు. ఆ సినిమా ఫ్లాప్ తో సినిమా రిజల్ట్ పై ఎక్సయిట్ అవ్వడం ఆపేశాడట.

“నా జీవితంలో బాగా ఎక్స్ పెక్ట్ చేసి పోయిన సినిమా గౌతమ్ నందా. అది బాగా ఆడుతుందని ఆశించాను. మేకింగ్ లో చిన్న చిన్న తప్పులున్నప్పటికీ ఆడుతుందని అనుకున్నాను. కానీ అది మిస్ ఫైర్ అయింది. ఆ సినిమాలో తప్పులున్నాయి, నేను కాదనను. కానీ ప్రేక్షకులు క్షమిస్తారనుకున్నాను. కానీ క్షమించలేదు. ఫ్లాప్ చేసి పడేశారు.”

ఇలా గౌతమ్ నంద ఫ్లాప్ పై తన బాధను వ్యక్తం చేశాడు గోపీచంద్. ఓ సినిమా హిట్టవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనే విషయం తనకు మేకింగ్ టైమ్ లోనే 90శాతం తెలిసిపోతుందంటున్నాడు గోపీచంద్. ఆ తర్వాత ప్రేక్షకులు ఇచ్చే తీర్పు తనపై పెద్ద ప్రభావం చూపించదంటున్నాడు.

“సినిమా రిజల్ట్ నాకు ముందే తెలిసిపోద్ది. కానీ తప్పదు కదా, నటించాలి. నేను హండ్రెడ్ పర్సెట్ ఇస్తాను, కానీ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు. ఓ దశకు వచ్చిన తర్వాత చెప్పడం అనవసరం. ముందే చెప్పినా కొందరికి అర్థం కాదు. రిజల్ట్ ఏంటనేది నాకు ముందే తెలుసు కాబట్టి, ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే టెన్షన్ నాకు ఉండదు.”

గోపీచంద్ తాజా చిత్రం రామబాణం. ఈ సినిమా దర్శకుడు శ్రీవాస్ తో గొడవలు జరిగాయనే విషయాన్ని ఖండిస్తున్నాడు గోపీచంద్. లెంగ్త్ ఎక్కువైందనే అంశంపై ఇద్దరి మధ్య డిస్కషన్ మాత్రమే జరిగిందని, ఎడిటింగ్ లో లేపేస్తారని షూటింగ్ టైమ్ లోనే చెప్పానని, కానీ శ్రీవాస్ వినలేదన్నాడు.

తను చెప్పినట్టుగానే కొన్ని సన్నివేశాల్ని ఎడిటింగ్ టైమ్ లో లేపేశారని, అదే విషయాన్ని శ్రీవాస్ కు గుర్తుచేశాను తప్ప, గొడవల్లేవని స్పష్టం చేశాడు. గోపీచంద్ గొడవలు పెట్టుకునే టైపు కాదు, నచ్చకపోతే సైలెంట్ గా పక్కకెళ్లిపోయే టైపు.