విజయ్ దేవరకొండను అలా వాడుకుంటున్నారు!

సినిమా వాళ్ల పేర్లతో సినిమాలు తీసి.. వాటికి ఉచిత పబ్లిసిటీ పొందడానికి పాకులాడే వాళ్లు సినిమా ఇండస్ట్రీలోనే చాలామంది ఉన్నారు. గత కొన్నాళ్లలో ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చాయి. 'వేర్ ఈజ్ విద్యాబాలన్', 'దిల్…

సినిమా వాళ్ల పేర్లతో సినిమాలు తీసి.. వాటికి ఉచిత పబ్లిసిటీ పొందడానికి పాకులాడే వాళ్లు సినిమా ఇండస్ట్రీలోనే చాలామంది ఉన్నారు. గత కొన్నాళ్లలో ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చాయి. 'వేర్ ఈజ్ విద్యాబాలన్', 'దిల్ రాజు ప్రేమలో పడ్డాడు', 'నిత్యామీనన్..' వంటి సినిమా టైటిళ్లు వినిపించాయి. అలాగే రామ్ గోపాల్ వర్మపేరుతో అయితే పలు సినిమాలు వచ్చాయి. 'డాటరాఫ్ వర్మ' తో మొదలుపెట్టి.. వర్మ పేరును అటూ ఇటూ వాడుకుంటూ సినిమాలు వచ్చాయి.

ఇదో మార్కెటింగ్ టెక్నిక్. అయితే అలాంటి సినిమాలు ఏవీ పెద్దగా ఉనికి చాటుకున్నది కూడా లేదు. అయినా అలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయి. అలాంటిదే మరోటి వస్తోందట.. దీనిపేరు 'దేవరకొండలో విజయ్ ప్రేమకథ'. ఇదీ సినిమా టైటిలు!

విజయ్ దేవరకొండ పేరును అటూ ఇటూ చేసి.. దానికి ప్రేమకథను తగిలించి..సినిమా టైటిల్ గా మార్చారు. పబ్లిసిటీ కోసం ఇలాంటి టైటిల్ ను అయితే చాలా కష్టపడే తయారు చేసినట్టుగా ఉన్నారు కానీ, ఈ మాత్రం క్రియేటివిటీ సినిమాల రూపకల్పనలో కూడా పెడితే బాగుంటుందేమో!

జగన్ గెలుపు వాళ్లకి నచ్చలేదు..