సంక్రాంతి నుంచి సమ్మర్ కు షిఫ్ట్

కొన్ని నెలల కిందటి సంగతి.. సంక్రాంతికి ఏకంగా అరడజను సినిమాలు రేసులో నిలిచాయి. చివరికి వచ్చేసరికి బాలయ్య, చిరంజీవి సినిమాలతో పాటు విజయ్ వారసుడు బరిలో నిలిచాయి. అలా సంక్రాంతి నుంచి తప్పుకున్న సినిమాలన్నీ…

కొన్ని నెలల కిందటి సంగతి.. సంక్రాంతికి ఏకంగా అరడజను సినిమాలు రేసులో నిలిచాయి. చివరికి వచ్చేసరికి బాలయ్య, చిరంజీవి సినిమాలతో పాటు విజయ్ వారసుడు బరిలో నిలిచాయి. అలా సంక్రాంతి నుంచి తప్పుకున్న సినిమాలన్నీ ఇప్పుడు సమ్మర్ ను టార్గెట్ చేశాయి.

సంక్రాంతి బరిలో వస్తుందనుకున్న ఏజెంట్ సినిమా, పండగ నుంచి తప్పుకొని వేసవికి రాబోతోంది. ఈ మేరకు ఇప్పటికే ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేసి మరీ సమ్మర్ కు వస్తున్నామంటూ ప్రకటించుకుంది యూనిట్. ఇప్పుడిదే కోవలో మరో సినిమా చేసింది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ఓపెనింగ్ టైమ్ లోనే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామంటూ ప్రకటించారు. కట్ చేస్తే, ఇప్పుడీ సినిమా కూడా సమ్మర్ కే పోస్ట్ పోన్ అయింది.

ఏప్రిల్ 29న వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాను విడుదల చేయబోతున్నట్టు 'సితార' ప్రకటించింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.

ఇలా రోజురోజుకు సమ్మర్ బాక్సాఫీస్ బరిలో సినిమాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆ టైమ్ కు ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో, ఇంకెన్ని సినిమాలు వాయిదా పడతాయో చూడాలి.