మిస్టర్ బచ్చన్ మార్కెటింగ్ ముచ్చట్లు!

రవితేజ‌ లేటెస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్. గత కొన్ని సినిమాలుగా రవితేజ‌ సినిమాలు అన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లే. అందువల్ల మార్కెట్ లేదు. కానీ బచ్చన్ వరకు కొంత బజ్ వచ్చింది. అందుకే మార్కెట్ లో…

రవితేజ‌ లేటెస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్. గత కొన్ని సినిమాలుగా రవితేజ‌ సినిమాలు అన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లే. అందువల్ల మార్కెట్ లేదు. కానీ బచ్చన్ వరకు కొంత బజ్ వచ్చింది. అందుకే మార్కెట్ లో డిస్కషన్ మొదలైంది. అమ్మకాల బేరాలు మొదలయ్యాయి. నిర్మాతలు ముందుగా సింగిల్ కాపీ సేల్ కింద అమ్మాలని అనుకున్నారు. 35 కోట్ల దగ్గర రేట్ కోట్ చేసారు. కానీ బయ్యర్లు బేరాలు మొదలుపెట్టడంతో ఇప్పుడు రెగ్యులర్ మార్కెటింగ్ ఫార్మాట్ మాదిరిగా ఏరియాల వారీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఆంధ్ర 18 కోట్లు, నైజాం 15 కోట్లు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సీడెడ్ కూడా అదే రేషియోలో చెబుతున్నారు. దర్శకుడితో వున్న అటాచ్ మెంట్ తో తనకు నైజాం ఇవ్వాలని దిల్ రాజు పట్టుపడుతున్నారు. మరో పక్క ఆసియన్ సురేష్ సంస్థ పోటీలో వుంది. మైత్రీ సంస్థకు పీపుల్స్ మీడియా అనుబంధం వుంది కనుక వాళ్లు కూడా నైజాం అడుగుతున్నారు.

కానీ గమ్మత్తేమిటంటే మాకంటే మాకు అంటూ చాలా మంది పోటీ పడుతున్నారు కానీ రేటు దగ్గర ముందు వెనుక ఆడుతున్నారు. ఆంధ్ర 14 కోట్ల దగ్గర బయ్యర్లు ఆసక్తిగా వున్నట్లు తెలుస్తోంది. అలాగే నైజాం విషయంలో 10 నుంచి 12 కోట్ల రేటు దగ్గర ఆసక్తిగా వున్నారని తెలుస్తోంది. అయితే ఈ రేట్లకు ఇవ్వడానికి బచ్చన్ మేకర్లు రెడీగా లేరు. అందుకే బేరాలు అలా వున్నాయి. బయ్యర్లు ఎవరు అన్నది ఫిక్స్ అయింది. కానీ రేట్లు, అగ్రిమెంట్లు తేలాలి.

ఇదిలా వుంటే సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కు ఇస్తున్నారు. అది కూడా ఫైనల్ అగ్రిమెంట్ కావాలి. అన్నీ ఓ కొలిక్కి వచ్చాయి కనుక ఇప్పుడు అధికారంగా విడుదల డేట్ ను ప్రకటించబోతున్నారు ఆగస్ట్ 14 ప్రీమియర్ తో అని. ఈ మధ్యకాలంలో రవితేజ‌ సినిమాకు ఈ మాత్రం మార్కెట్, పోటీ రావడం ఇదే.. అదే బచ్చన్ స్పెషల్.

4 Replies to “మిస్టర్ బచ్చన్ మార్కెటింగ్ ముచ్చట్లు!”

  1. ..ప్రతి మంగళవారం అప్పు అని జగన్ మీద విషం చిమ్మిన ఈనాడు జ్యోతి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు 

    విజనరీ బాబు

    మన బాబు 40 రోజుల్లో 30 వేల కోట్ల అప్పు

  2. అత్యంత విశ్వాసాని సమాచారం ప్రకారమ్.

    ప్రజల ఆలోచనలను సంక్షేమ పథకాలు నుంచి మళ్లిచట్టానికి , వినుకొండ మడర్‌ని మన చిన బాబు , పెద్ద బాబు ప్లాన్ చేసారు అంట.

Comments are closed.