ముందు కాదు వెనుకే అన్న మెగాస్టార్

సంక్రాంతి సినిమా డేట్ లు ఫిక్స్ అయిపోయాయి. జనవరి 12నే బాలయ్య వీరసింహారెడ్డి, విజయ్ వారసుడు సినిమాలు పోటా పోటీగా విడుదలవుతున్నాయి. నిర్మాత దిల్ రాజు తను నిర్మించిన తమిళ హీరో విజయ్ వారసుడు…

సంక్రాంతి సినిమా డేట్ లు ఫిక్స్ అయిపోయాయి. జనవరి 12నే బాలయ్య వీరసింహారెడ్డి, విజయ్ వారసుడు సినిమాలు పోటా పోటీగా విడుదలవుతున్నాయి. నిర్మాత దిల్ రాజు తను నిర్మించిన తమిళ హీరో విజయ్ వారసుడు ను ఏకంగా బాలయ్య సినిమా మీద పోటీకి నిలుపుతున్నారు. మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య సినిమా 13న విడుదలకు రెడీ అవుతోంది.

11 లేదా 13 డేట్లు మెగాస్టార్ చాయిస్ కోసం వుంచితే 13 డేట్ కే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సంక్రాంతి ముందుగా సినిమాల మీద అంత ఆసక్తి వుండదని, మరీ 11 బుధవారం వస్తే అంతగా మంచి ఓపెనింగ్ లు వుండకపోవచ్చని, అందుకే 13 బెటర్ అని మెగాస్టార్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

కానీ బాలయ్య మాత్రం తన ముహుర్తాల నమ్మకం ప్రకారం 12వ తేదీని ఎంచుకున్నారు. అంతే కాదు. ఆ డేట్ ను ప్రకటించడానికి కూడా ముహుర్తం బాలయ్యే నిర్ణయించారు. మొత్తం మీద 12న రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. 13న సోలో విడుదల వుంటుంది. 14 నుంచి ఎవరి స్టామినా వారిదే.మూడు సినిమాల మీద మంచి అంచనాలు వున్నాయి.

మెగాస్టార్ సినిమాకు రవితేజ అదనపు ఆకర్షణ. బాలయ్య సినిమాకు డబుల్ రోల్ అట్రాక్షన్. విజయ్ సినిమాకు రష్మిక తో జోడీ, పాటలు అట్రాక్షన్ కాబోతున్నాయి.