ముసలోడి దసరాపండగ

ఫక్ అంటే అంత బాగోదు అనేమో..ఎఫ్ సి యు కె అని అక్షరాలు పేర్చి, ఎఫ్ అనే అక్షరంతో ఏ తెలుగు పేరూ ఎలాగూ రాదనేమో, ఫణి అనే పేరుకే ముందు పిహెచ్ బదులు…

ఫక్ అంటే అంత బాగోదు అనేమో..ఎఫ్ సి యు కె అని అక్షరాలు పేర్చి, ఎఫ్ అనే అక్షరంతో ఏ తెలుగు పేరూ ఎలాగూ రాదనేమో, ఫణి అనే పేరుకే ముందు పిహెచ్ బదులు ఎఫ్ ను వాడేసి, మొత్తానికి తాము అనుకున్న టైటిల్ ను 'ఫిక్స్' చేసేసారు. 

రంజిత్ మూవీస్ పతాకంపై దామోదర ప్రసాద్ నిర్మించే ఈ సినిమా టీజర్ బయటకు వదిలారు. ఫాదర్, చిట్టి, ఉమ, కార్తీక్ అనే ఈ నాలుగు క్యారెక్టర్ల నడుమ జరిగే కథలో పాపం, తండ్రీ, కొడుకులవి ఒకటే బుద్ది. అమ్మాయి కనిపిస్తే అల్లుకుపోవడం. 

మధ్యలో ఈ ఉమ లవ్ స్టోరీ..చిట్టి అనే పాప ఇంట్రస్టింగ్ స్టోరీ. ఇదే టీజర్ చెబుతున్న విషయం. తెల్ల జుట్టు జగపతి బాబు, చొక్కా విప్పి మరీ చేసే విన్యాసాలు, హీరో యూత్ ఫుల్ యవ్వారాలు, హీరోయిన్ రుసరుసలు, చిన్నపాప సరదాలు అన్నీ కలిపి ఇంట్రస్టింగ్ గా తయారుచేసారు టీజర్ ను. 

ఇలాంటి తండ్రీ కొడుకుల కథను అలాగే వదిలేస్తే జనాలు ఎలాగూ ఏమనుకుంటారో అనే అనుమానం వుండనే వుంటుంది. ఆ మేరకు సినిమాలో కథలో ఏవో ట్విస్ట్ లు వుండనే వుంటాయి అనే ఆసక్తి కూడా కలిగించిందీ టీజర్.