గూగులమ్మ..మీకు అంత సాయమా?

ఆశ్చర్యంగా వుంది. పెద్దల మాటలను తప్పు పట్టడం లేదు. వారి ఆదేశాలను, నిర్ణయాలను తప్పు పట్టడం లేదు. పదవ తరగతి పిలగాడి నుంచి ఐఎఎస్ కు ప్రిపేర్ అయ్యే పోరడి వరకు సౌసైటీలో ఎప్పుడు…

ఆశ్చర్యంగా వుంది. పెద్దల మాటలను తప్పు పట్టడం లేదు. వారి ఆదేశాలను, నిర్ణయాలను తప్పు పట్టడం లేదు. పదవ తరగతి పిలగాడి నుంచి ఐఎఎస్ కు ప్రిపేర్ అయ్యే పోరడి వరకు సౌసైటీలో ఎప్పుడు ఏం జరుగుతోందో చాలా గట్టి పట్టుతో వుంటారు. ఎందుకంటే పరిక్షలు రాయాలి కాబట్టి.

ఇక అధికారులు, వ్యాపారులు, లాయర్లు, డాక్టర్లు, ఇలా పెద్ద పెద్దలంతా కూడా మరీ చిన్న చిన్న విషయాలను కాకున్నా , ప్రపంచ పోకడలు ఎలా వున్నాయి అన్నవి పట్టించుకుంటూనే వుంటారు. అందరూ తెలుగు పత్రికలు చదవకున్నా, ఇంగ్లీష్ పేపర్ల హెడ్ లైన్స్ అన్నా చూస్తూ వుంటారు. 

మనకు మాంచి ఉద్యోగం వుంది, లేదా వ్యాపారం వుంది ఇంకెందుకు జనరల్ నాలెడ్జ్. ప్రపంచం ఎటు పోతోందో? ఏం జరుగుతోందో మనకెందుకు అని డీ లింక్ అయిపోయి వుండరు. సడెన్ గా ఎవరో వచ్చి ఎబిసిడి అని చెప్పేసి, గూగుల్ చేసుకో అంతా తెలుస్తుంది అంటే అప్పుడు గూగుల్ చేసుకుని, అవునా..ఇంత వుందా? అర్రె అస్సలు ఈ విషయాలే తెలియవే అని ఆశ్చర్యపోవడం అంటే ఏమనుకోవాలి?

అసలు ఇలా ఆశ్చర్యపోయేవారికి గూగుల్ లో సమాచారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు అనుకోవాలా? తెలియదు అనుకోవాలా?  ఎవరెవరు ఎక్కెడెక్కడ పెట్టిన సమాచారం, టాగ్స్ ఆధారంగా గూగుల్ మన ముందుకు తెస్తుందని తెలుసుకుంటే, మనకు కావాల్సిన, మనం అనుకున్న సమాచారాన్ని గూగుల్ లోకి ఎలా పంపాలో ఇట్టే తెలిసిపోతుంది. 

వినదగు నెవ్వరు చెప్పిన అన్నాడు సుమతీకారుడు. అలాగే గూగుల్ ఏం చూపించినా చూడు..చదువు..తప్పులేదు. కానీ అదే సుమతీకారుడు ఏం అన్నాడు…వినినంతనె వేగపడక అని కూడా అన్నాడు. అదే విధంగా గూగుల్ లో వున్నదంతా నిజమని వేగపడడం కూడా తప్పే. 

అయినా ముంజేతి కంకణానికి అద్దమేల అన్నట్లు,  మనం పనిచేస్తున్న వ్యవస్థకు అనుబంధంగానో, సహబంధంగానో వున్న వ్యవస్థల గురించి, వాటిని నడిపిస్తున్న నేతల గురించి తెలియకుండానే ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరో చెబితే గూగుల్ చేస్తే తప్ప తెలియనంత అజ్ఖానంలో వున్నారు అని అనుకునే పరిస్థితి వస్తే, హతవిధీ అని నిట్టూర్చడం తప్ప వేరు చేయగలిగింది లేదు.

మిగతా సీఎం లు ఒక లెక్క, జగన్ ఒక లెక్క

ఇంతవరకూ ఒకా ఛాన్స్ కూడా రాలేదు