సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాజ్ క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గుండెపోటుతో కూకట్‌పల్లిలోని తన నివాసంలో కన్నుమూశారు.  Advertisement మ్యూజిక్ డైరెక్టర్ రాజ్…

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాజ్ క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గుండెపోటుతో కూకట్‌పల్లిలోని తన నివాసంలో కన్నుమూశారు. 

మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ స్వయంగా అలనాటి సంగీత దర్శకుడు టీవీరాజు కుమారుడు. ఆయన పూర్తి పేరు తోటకూర సోమరాజు కాగా రాజ్‌ కోటిగా టాలీవుడ్‌లో ఫేమస్ అయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన 'రాజ్‌-కోటి' ద్వయంలో రాజ్ కూడా ఒకరు.  దశాబ్దాలపాటు ఈ ద్వయం సినీప్రియులను తమ సంగీతంతో ఊర్రూతలూగించింది. 

సంగీత దర్శకుడు కోటీతో కలిసి ఎన్నో సూపర్ హిట్ పాటలను కంపోజ్ చేసాడు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. 

కాగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే రాజ్‌-కోటి మధ్య విభేదాలు తలెత్తాయి. తర్వాత వీరిద్దరూ విడిపోయి ఎవరికి వారు విడివిడిగా ప‌ని చేశారు. అలా రాజ్ సొంతంగా 10 లకు మ్యూజిక్‌ అందించాడు. రాజ్ ఒంటరిగా సంగీతం అందించిన సినిమాల్లో “సిసింద్రీ” ఒక్కటే చెప్పుకోదగినది.