నైజాంలో ‘మైత్రీ’ సెట్ అయినట్టేనా..?

నైజాంలో ఓ పెద్ద సినిమాను రిలీజ్ చేయాలంటే దిల్ రాజు కావాలి. ఈ ప్రాంతంలో దిల్ రాజు-శిరీష్ కు ఉన్న హోల్డ్ అలాంటిది. వీళ్లతో కలిసి ఏషియన్ గ్రూప్ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది. పంపిణీ…

నైజాంలో ఓ పెద్ద సినిమాను రిలీజ్ చేయాలంటే దిల్ రాజు కావాలి. ఈ ప్రాంతంలో దిల్ రాజు-శిరీష్ కు ఉన్న హోల్డ్ అలాంటిది. వీళ్లతో కలిసి ఏషియన్ గ్రూప్ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుంది. పంపిణీ రంగంలో వీళ్లిద్దరిది మంచి అండర్ స్టాండింగ్.

మధ్యలో వరంగల్ శ్రీను లాంటి వ్యక్తులు ప్రవేశించి, కొన్ని భారీ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసినప్పటికీ నిలదొక్కుకోలేకపోయారు. ఆచార్య, లైగర్ లాంటి సినిమాలతో బాగా ఇబ్బంది పడ్డారు. అలా నైజాంలో కొత్త ప్లేయర్స్ రాక పూర్తిగా తగ్గిపోయింది. ఇలాంటి టైమ్ లో లీగ్ లోకి ఎంటరైంది మైత్రీ మూవీ మేకర్స్. ఒకేసారి తమకు చెందిన రెండు భారీ సినిమాల్ని నైజాంలో సొంతంగా రిలీజ్ చేసింది.

దీనిపై మైత్రీకి-దిల్ రాజుకు మధ్య చాలా వాదోపవాదనలు జరిగినట్టు కథనాలు వచ్చాయి. ఓ దశలో మైత్రీ సంస్థకు పూర్తిగా సహాయ నిరాకరణ చేశారు దిల్ రాజు. ఆ తర్వాత అంతా ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో నైజాంలో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎలా పెర్ఫార్మ్ చేసిందనే విషయంపై అందరి దృష్టి పడింది.

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్ని నైజాంలో మైత్రీ సంస్థ విడుదల చేసింది. ఈ మేరకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ఏర్పాటుచేసింది. తమ సినిమాలతో వీళ్లు నైజాంలో మంచి ఓపెనింగ్స్ అందుకున్నారు. మొదటి రోజు షేర్లు సంగతి పక్కనపెడితే, నైజాం థియేట్రికల్ సిస్టమ్ పై పూర్తి అవగాహన పెంచుకున్నారు ఈ నిర్మాతలు. ఎగ్జిబిటర్లు, బయ్యర్లతో ఓ ఛెయిన్ ను ఏర్పాటుచేయగలిగారు.

అయితే ఆల్రెడీ దిల్ రాజు హెచ్చరించినట్టు, పంపిణీ రంగంలో నిలదొక్కుకోవాలంటే 2 సినిమాలతో అయ్యే పనికాదు. ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో తెలియదు. ఈ విషయంలో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మరింత రాటుదేలాల్సి ఉంది.