Advertisement

Advertisement


Home > Movies - Movie News

మైత్రీ ఎందుకు వద్దనుకున్నట్లు?

మైత్రీ ఎందుకు వద్దనుకున్నట్లు?

పిలిచి పిల్లను ఇస్తామంటే ఎవరన్నా వద్దంటారా? వద్దనే వాళ్లు కూడా వుంటారు. వాళ్లకీ రీజన్ వుంటుంది. ప్రభాస్ కు సంబంధించిన రెండు సినిమాల విషయంలో ఇలా జరిగింది. 

దానయ్య నిర్మాతగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ప్లాన్ చేసారు. కానీ దానయ్య ఎందుకో వద్దనుకున్నారు. అలాంటి టైమ్ లో ఆయన ఇచ్చిన భారీ అడ్వాన్స్ ను వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎవరు టేకోవర్ చేస్తారని వెదికారు. ముగ్గురు నలుగురు నిర్మాతల దగ్గరకు వెళ్లింది. కానీ ఎవ్వరూ సాహసించి ముందుకు రాలేదు. అప్పుడు ముందుకు వచ్చిన బ్యానర్ పీపుల్స్ మీడియా.

కట్ చేస్తే…

ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను హొల్ సేల్ గా అమ్మేయాలనుకుంది యువి సంస్థ. ఆసియన్ సునీల్ లాంటి వాళ్ల దగ్గరకు వెళ్లింది. పెద్ద డిస్ట్రిబ్యూటర్లు కదా అని. కానీ ఎవరూ ఎందుకో ముందుకు రాలేదు. దాంతో ఇటీవల డిస్ట్రిబ్యూషన్ లోకి దిగిన మైత్రీ సంస్థ దగ్గరకు వెళ్లింది. వాళ్లు కూడా ఎందుకో ముందుకు రాలేదని విశ్వసనీయ వర్గాల బోగట్టా. అప్పుడు మళ్లీ ఆదుకున్నది పీపుల్స్ మీడియానే.

ఇప్పుడు పీపుల్స్ మీడియా ప్రభాస్ ను తమ బ్యానర్ హీరోగా భావిస్తోంది. ఇప్పటికే ఓ సినిమా చేస్తున్నారు. స్పిరిట్ ప్రాజెక్ట్ ను తీసుకున్నారు. ప్రభాస్ తో ఇప్పటి వరకు వున్న యువి పక్కకు తప్పుకుంది. అందువల్ల ఇకపై ప్రభాస్ తెలుగు వరకు ఏం ఇవ్వాలన్నా, ఇక పీపుల్స్ మీడియాకే ఫస్ట్ ఫ్రిపరెన్స్ గా వుంటుంది.

ఇలాంటి చాన్స్ కోసమే పీపుల్స్ మీడియా ముందుకు వచ్చి వుంటుంది అనుకుంటే, మరి మైత్రీ ఎందుకు ఇలాంటి చాన్స్ వదలుకున్నట్లే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?