Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాంది క్రేజ్ నిలెబడుతుంది ‘సార్’

నాంది క్రేజ్ నిలెబడుతుంది ‘సార్’

బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్'తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్‌ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 2న నేను స్టూడెంట్ సార్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నిర్మాత 'నాంది' సతీష్ వర్మ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

'నాంది' అయినా 'నేను స్టూడెంట్ సర్' అయినా .. ఏదైనా ఓకే చేయడానికి కారణం కథలో వున్న మంచి కొత్త పాయింట్. నాంది సినిమాలో హీరో లీగల్ గా రివెంజ్ తీర్చుకోవడం అనేది కొత్త పాయింట్. నేను స్టూడెంట్ సర్ లో కూడా కొత్త పాయింట్ వుంది. మంచి థ్రిల్లర్ జోనర్ లో వెళుతుంది. బెల్లంకొండ గణేష్ ఈ కథకు చక్కగా సరిపోయారు. నేను స్టూడెంట్ సర్, నాందికి వచ్చిన క్రేజ్ ని నిలబెడుతుందని భావిస్తున్నాను.

కృష్ణ చైతన్య గారు ఓ అరగంట కథ చెప్పారు. కథ ఒక మొబైల్ ఫోన్ తో మొదలౌతుంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే అంశం. స్టూడెంట్స్ మంచి ఐఫోన్ కొనుక్కోవాలని చాలా తాపత్రయ పడతారు. ఇది ప్రతి కుటుంబంలో చూస్తాం. ఆ పాయింట్ బాగా నచ్చింది. అలాగే ఈ సినిమా ఐఫోన్ తో స్టార్ట్ అవుతుంది కానీ మంచి థ్రిల్లర్ గా వెళుతుంది. మూడు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లు వుంటాయి. ఆ ట్విస్ట్ లు నచ్చి కథ ఓకే చేశాను.

అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ హిందీ ఛత్రపతిలో చేశారు. అదే సమయంలో వాళ్ళ అమ్మాయిని సౌత్ లో లాంచ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా సంప్రదించడం జరిగింది. అవంతిక ఇంతకుముందు ఒక వెబ్ సిరీస్ చేసింది. ఈ చిత్రంలో తన పాత్రని చాలా చక్కగా చేసింది.

నాంది వెలకట్టలేని పేరు తీసుకొచ్చింది. ఒక గౌరవం తీసుకొచ్చింది. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది. నేను సాధారణంగా రెండు సార్లు చూసిన సినిమాలు చాలా తక్కువ. బాహుబలి, హ్యాపీ డేస్ , కొత్తబంగారులోకం లాంటి కొన్ని సినిమాలు తప్పితే చాలా వరకూ రెండోసారి చూడను. 'నేను స్టూడెంట్ సర్' మాత్రం ఇప్పటి వరకూ నాలుగు సార్లు చూశాను. ఎక్కడా బోర్ కొట్టదు. ఖచితంగా రీచ్ అవుతుంది. క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా వుంటుంది.

నాంది సినిమాను నేషనల్ అవార్డులకు అప్లయ్ చేసాం. ఏదో కేటగిరీలో అవార్డ్ వస్తుందని ఆశిస్తున్నాం. ఇంతకుముందు సైమా, సాక్షి ఎక్స్ లెన్స్, దాదాసాహెబ్ ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?