మైత్రీ మీదకు నైజాం ఎగ్జిబిటర్లు?

నైజాంలో థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ రగడ కాస్త ముదిరేమాదిరిగానే కనిపిస్తోంది. మైత్రీ సంస్థకు అనుబంధంగా సీడెడ్ శశి భాగస్వామ్యంతో ప్రారంభించిన మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మీద శిరీష్-సునీల్ గట్టిగా పట్టుకున్నట్లు కనిపిస్తోంది.  Advertisement నైజాం ఎగ్జిబిటర్లు…

నైజాంలో థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ రగడ కాస్త ముదిరేమాదిరిగానే కనిపిస్తోంది. మైత్రీ సంస్థకు అనుబంధంగా సీడెడ్ శశి భాగస్వామ్యంతో ప్రారంభించిన మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మీద శిరీష్-సునీల్ గట్టిగా పట్టుకున్నట్లు కనిపిస్తోంది. 

నైజాం ఎగ్జిబిటర్లు అంతా ఒక తాటి మీదకు వచ్చి, మైత్రీ మీద ఉద్యమించే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. అయితే ఎగ్జిబిటర్లకు ఏమిటి సమస్య? వాళ్లకేం సంబంధం అని ఆరాతీస్తే…గతంలో పుష్ప 2, సర్కారు వారి పాట సినిమాలు థియేటర్లో వుండగానే ఓటిటి కి ఇచ్చేయడం అన్నది పాయింట్ అని అంటున్నారు.

ఈ మేరకు కార్యాచరణకు దిగాలని, వీలయితే ఓ ప్రెస్ మీట్ పెట్టి తమ డిమాండ్లు వినిపించాలని ఎగ్జిబిటర్లు సమాయత్తం అవుతున్నారని వినిపిస్తోంది. ఓటిటి ఫలానా టైమ్ వరకు ఇవ్వము అని చెబితే కానీ థియేటర్లు ఇవ్వమంటారా? లేదా మరింకేం డిమాండ్లు వుంటాయి అన్నది తెలియాల్సి వుంది. 

ఎంత కాదన్నా ఎగ్జిబిటర్ల వెనకాల శిరీష్-సునీల్ వున్నారనే అంటారు. ఎందుకంటే మైత్రీ పంపిణీ ఆఫీసు వల్లే ఇదంతా జరుగుతుందని అనుకోవడం పక్కా. పైగా నైజాం థియేటర్లు మూడు వంతులు సునీల్ చేతిలోనే వున్నాయి కూడా. పైగా సీడెడ్ లో తాము ఆఫీసు చేసే ఆలోచనలో వున్నారని వార్తలు కూడా వచ్చాయి.

కానీ తనకు ఏ వివాదం లేదని, అందరికీ సమానంగా థియేటర్లు ఇస్తానని, అందరూ, అన్ని సినిమాలూ తనవే అనీ సునీల్ అంటున్నారు. చూడాలి పండగ సినిమాల గడబిడ ఎక్కడకు చేరుకుంటుందో?