ప్రసిద్ద సినిమా నిర్మాణ సంస్థ కార్యాలయాల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నరకే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటి అధికారులు మైత్రీ ఆఫీసుకు చేరుకుని సోదాలు మొదలుపెట్టారు.
మైత్రీ సంస్థ ఇటీవల చాలా భారీ ప్రాజెక్టులు టేకప్ చేసింది. చిరంజీవి, బాలకృష్ణ,పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ ఇలా పలు క్రేజీ ప్రాజెక్టుల లైన్ లో వున్నాయి.
అంతే కాదు ఇటీవలే సినిమాల పంపిణీ వ్యాపారంలోకి కూడా దిగారు. అదీ కాక పలువురు ఎన్నారైల పెట్టుబడులు మైత్రీలో వున్నాయనే టాక్ వుంది. పొలిటికల్ ఇన్వెస్ట్ మెంట్ లు కూడా మైత్రీలో వుండి వుంటాయనే గుసగుసలు వున్నాయి. అన్నిటికీ మించి సినిమా ఇండస్ట్రీ మీద ఐటి కన్ను వుందని ఇటీవల చాలా కాలంగా వినిపిస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో మైత్రీ మీద ఐటి దాడులు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీ జనాలు జాగ్రత్త పడడం మొదలైంది. మైత్రీ లాంటి ఆఫీసు మీద దాడితో మరింత జాగ్రత్తలు ఎక్కువవుతున్నాయి. పైగా మైత్రీ పై సోదాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు రావడం అన్నది కాస్త డిస్కషన్ పాయింట్ గా మారింది.