మైత్రీ-బోయపాటి ప్యాచప్

టాలీవుడ్ టాప్ బ్యానర్ లో చేయని కాంబినేషన్ లేదు. హీరోలు, డైరక్టర్లు అంతా అక్కడే వున్నారు. కానీ బోయపాటి శ్రీను విషయంలో మాత్రం చిన్న డిస్ట్రబెన్స్.  Advertisement గతంలో ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు. కానీ…

టాలీవుడ్ టాప్ బ్యానర్ లో చేయని కాంబినేషన్ లేదు. హీరోలు, డైరక్టర్లు అంతా అక్కడే వున్నారు. కానీ బోయపాటి శ్రీను విషయంలో మాత్రం చిన్న డిస్ట్రబెన్స్. 

గతంలో ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు. కానీ సరైన హిట్ రాకపోవడంతో వెనక్కు తీసుకోవాలనుకున్నారు. అక్కడే వచ్చింది తకరారు.

సినిమా కోసం ఇచ్చారు. సినిమా చేస్తా. అంతే కానీ వడ్డీలు, లెక్కలు కుదరవు అని ఎదురు తిరిగారు బోయపాటి అంటూ వార్తలు వచ్చాయి. ఆ వివాదం అలా వుండనే వుంది. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత అఖండ సక్సెస్ తరువాత అంతా మారిపోయింది.

ఇటు నిర్మాతలు అటు బోయపాటి..అంతా ఆటలో అరటిపండుగా మార్చేసారు. మనం మనం ఒకటి అనుకున్నారు. మైత్రీ బ్యానర్ లో బోయపాటి సినిమా ఫిక్స్ అయిపోయింది. హీరో ఎవరు అన్నది తరువాత సంగతి. ఇక్కడ ఏదైనా సక్సెస్ నే మాట్లాడుతుంది.