ఇలా ప్రారంభించి, అలా రెడీ చేసి, సంక్రాంతి బరిలో దింపుతున్నారు ‘నా సామి రంగా’ సినిమాను. అందరికీ ఆశ్చర్యమే.
హీరో నాగ్ నాన్ స్టాప్ గా షూటింగ్ చేయడం, ఒక పక్క బిగ్ బాస్ చేస్తూనే ఈ సినిమా కూడా పారలల్ గా చేయడం. అంత వెల్ ప్లాన్డ్ గా సినిమా ఫినిష్ చేయడం. నాగ్ పట్టుదల వల్లే ఇదంతా సాధ్యమైంది అన్నది కొంత వరకు వాస్తవమే. అయితే దీని వెనుక మరో సీక్రెట్ కూడా వుందట. అది నాగ్ వెల్లడిస్తేనే తెలిసింది.
నా సామిరంగా సినిమా షూట్ ప్రారంభించే నాటికే చేతిలో బౌండ్ స్క్రిప్ట్ తో పాటు, ఎవరెవర్ని తీసుకోవాలి, ఎక్కడెక్కడ లోకేషన్లు, ఏ షెడ్యూలు ఎప్పుడు చేయాలి ఇలా అన్నీ పక్కాగా ప్లాన్ రెడీ చేసి వుంచుకున్నారట.
షూటింగ్ స్టార్ట్ అనే వేళకే రెండు పాటలు లిరిక్స్ తో రెడీగా వున్నాయట. కేవలం ఓ మంచి డైరక్టర్ కావాలి అనేది తప్పిస్తే సినిమా వర్క్ మొత్తం రెడీ చేసి పెట్టారట. బిన్నీ ని డైరక్టర్ గా ఓకె చేసిన వెంటనే సెట్ మీదకు వెళ్లి చకచకా ఫినిష్ చేసారట.
నిజంగా ఇది కాస్త చెప్పుకోదగ్గ విషయమే. ఎ టు జెడ్ ఇలా ప్లాన్ చేసి రెడీగా వుంచితే నిర్మాతకు అస్సలు వేస్ట్ అన్నది వుండదు. ఇంట్రస్ట్ లు కలిసి వస్తాయి. ఓ ప్లాన్ ప్రకారం షూట్ చేసి సినిమాను రెడీ చేసేయవచ్చు. అదే నాగ్ చేసింది. నా సామి రంగా వెనుక వున్న సీక్రెట్. ఈ సినిమాకు నిర్మాత చిట్టూరి శ్రీను. సమర్పకుడు పవన్.