నాగ్ ఫ్యాన్స్ బేస్ ఏమయింది?

అక్కినేని ఫ్యామిలీకి మొదటి నుంచీ ఓ ఫ్యాన్స్ బేస్ అంటూ వుంటూ వస్తోంది మిగిలిన హీరోలకు మాదిరిగానే. అలాంటి ఫ్యాన్స్ బేస్ వుంటేనే తొలి ఆటకు టికెట్ లు తెగేది. ఆ ఫ్యాన్స్ బేస్…

అక్కినేని ఫ్యామిలీకి మొదటి నుంచీ ఓ ఫ్యాన్స్ బేస్ అంటూ వుంటూ వస్తోంది మిగిలిన హీరోలకు మాదిరిగానే. అలాంటి ఫ్యాన్స్ బేస్ వుంటేనే తొలి ఆటకు టికెట్ లు తెగేది. ఆ ఫ్యాన్స్ బేస్ ను బట్టే హీరో డిమాండ్ నిలబడేది. కానీ రాను రాను ఈ ఫ్యాన్స్ బేస్ లు తగ్గుతూ వస్తున్నాయి. కానీ ప్రతి హీరోకి ఎంతో కొంత వుంటున్నాయి. నాగార్జున విషయం వచ్చేసరికి తగ్గడం కాదు మాయం అయిపోతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే నాగ్ సినిమాల తొలి ఆటలకు డిమాండ్ కనిపించడం లేదు.

ఈ వారం సీనియర్ హీరోలు నాగ్, చిరు ఇద్దరూ చెరో సినిమా చేస్తున్నారు. నాగ్ చేస్తున్న సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. చిరు చేస్తున్న సినిమాకు మోహన్ రాజా దర్శకుడు. ప్రవీణ్ పేరు మన వాళ్లకు అంతో ఇంతో పరిచయమే. మోహన్ రాజా పేరు మన వాళ్లకు అంత ఎక్కువ పరిచయం కాదు. అందువల్ల కాంబినేషన్ ఫ్యాక్టర్ అన్న రీజన్ ఇక్కడ చెల్లదు. కానీ చిరు సినిమాకు మాంచి ఓపెనింగ్ వచ్చేలా వుంది. నాగ్ సినిమాకు ఓపెనింగ్ మరీ నీరసంగా వుంది.

వైల్డ్ డాగ్ సినిమాను నాగ్ విపరీతంగా ప్రమోట్ చేసాడు. అంతకు ముందు మన్మధుడు 2 సినిమాను కూడా అంతే. రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిలయ్యాయి. తరువాత బంగార్రాజు సినిమాను గట్టిగా నమ్మారు. అది అంచనాలను చేరుకుంది. మళ్లీ ఘోస్ట్ సినిమా విషయంలో తేడా కొడుతూంది. ఈసౌరి నాగ్ మరీ ఎక్కువ పబ్లిసిటీ జోలికిపోలేదు. ఆయన బిగ్ బాస్ లో బిజీగా వుండడమే కారణం అంటున్నారు.

నాగ్ ఫ్యామిలీ సినిమాలు చేస్తుంటే ఇంతో అంతో ఓకె అవుతున్నాయి. వైల్డ్ డాగ్, మన్మధుడు2 లాంటి పాత్రలు వేస్తుంటే జనం పక్కన పెడుతున్నారు. కానీ నాగ్ మాత్రంగా యాక్షన్, రొమాన్స్ అంటూ అటే వెళ్తున్నారు. జనం మొహం చాటేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే స్వంత ఫ్యాన్ బేస్ లేనపుడే. 

ఎప్పటి నుంచో వున్న అక్కినేన ఫ్యాన్స్ వేరు. ఈ తరం ఫ్యాన్స్ అఖిల్, చైతన్య ఫ్యాన్స్ గా మారిపోయారు. నాగ్ కు ఫ్యాన్స్ అండ తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది.