Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాని..దసరా.. తీన్ మార్

నాని..దసరా.. తీన్ మార్

హీరో నానిని ఇప్పటి వరకు చూడని కొత్త అవతారం లో చూపిస్తున్నట్లుంది ‘దసరా’ సినిమాలో. ఇప్పటి వరకు నాని అంటే మనకు ఓ క్లాస్ హీరో. అలాంటి క్లాస్ హీరోని తీసుకెళ్లి తమిళ సినిమాలో పడేసినట్లు అనిపిస్తుంది ఈ సాంగ్ చూస్తుంటే. రంగస్థలంలో చరణ్, పుష్పలో బన్నీ, అదే కోవలో ఇప్పుడు నాని ట్రయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సింగరేణి కాలరీస్ బ్యాక్ డ్రాప్ లో తీసిన పాట ఇది. ఫుల్ గా బ్లాక్ టింట్ తోనే చిత్రీకరించారు.

పుల్ తీన్ మార్ మాస్ బీట్ ను జోడించారు. దానికి తగినట్లే నాని ‘ఫుల్’ గా ఊగిపోయారు. వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా అదే దారిలో కనిపించారు. పాట మొత్తం ‘పీయూ..పీయూరే..దారూ పీయూరే’ అన్నట్లు జోర్ దార్ గా సాగింది. నాని ని ఇలాంటి మాస్ అవతారంలో చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

జెర్సీ, శ్యామ్ సింగ రాయ్ లాంటి వరుస క్లాస్ సినిమాల తరువాత నాని ఒక్కసారిగా మేకోవర్ తో రగ్డ్ లుక్ తో దసరా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో నాని ఎలా వుండబోతున్నాడో, క్యారెక్టర్ ఎలా వుంటుందో అన్నది ఈ పాటతో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా,తెలంగాణా శైలిలో కాసర్ల శ్యామ్ పాట రాశారు. రాహుల్ సిప్లిగంజ్, పాలమూరు జంగిరెడ్డి, నర్సమ్మ, గొట్టె కనకవ్వ, గన్నోర దాసు లక్ష్మి ఆలపించారు. 

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా