Advertisement

Advertisement


Home > Movies - Movie News

'భూములు పంచుకున్న' ఇష్యూ క్లోజ్ అయిందట!

'భూములు పంచుకున్న' ఇష్యూ క్లోజ్ అయిందట!

తెలంగాణ ప్రభుత్వంతో ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది చిరంజీవి నేతృత్వంలో సమావేశమైతే.. భూములు పంచుకోవడం కోసమే ఆ మీటింగ్ పెట్టుకున్నారంటూ బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో దీనిపై నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాలయ్య తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

నాగబాబు వ్యాఖ్యలను బాలయ్య చాలా లైట్ తీసుకున్నారు. ఛీ..ఛీ.. నాగబాబుపై నేను స్పందించడమేంటంటూ ఓ ఇంటర్వ్యూలో మౌనం దాల్చారు. మరోవైపు బాలయ్యకు మద్దతుగా నిలిచే బ్యాచ్ కూడా తయారైంది. తేజ లాంటి దర్శకులు బాహాటంగా బాలయ్యకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో.. మరోసారి ఈ వివాదంపై నాగబాబు రియాక్ట్ అయ్యారు. అయితే ఆ వివాదం సమసిపోయిందని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని నాగబాబు రియాక్ట్ అవ్వడం విశేషం.

"బాలయ్య వ్యాఖ్యలపై నేను రియాక్ట్ అయ్యాను. అలా కామెంట్ చేయడం తప్పు అన్నాను. దానిపై బాలయ్య పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. దీంతో ఆ సమస్య అక్కడితో తీరిపోయింది. నాకు, బాలయ్యతో ఎలాంటి గొడవల్లేవు. మా ఇద్దరికీ పరిచయం కూడా చాలా తక్కువ. ఆవేశపడి మాట్లాడారు కాబట్టి అలా మాట్లాడకూడదని మాత్రమే చెప్పాను."

బాలయ్య పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి ఆ వివాదం సమసిపోయినట్టేనని నాగబాబు అనడం కాస్త కామెడీగా ఉన్నప్పటికీ.. వ్యవహారాన్ని ఇంకా పెద్దది చేయడం ఇష్టంలేక నాగబాబు ఇలా మాట్లాడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇక్కడితో ఆగలేదు నాగబాబు. బాలయ్య కేవలం ఆవేశంతో మాట్లాడారని అన్నారు.

"భూములు పంచుకున్నారంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఆయన కోపంతో అన్నవే. కావాలని అనలేదు. తర్వాత ఆయన సర్దుకున్నారు. కాబట్టి ఇంతకంటే ఆయనపై ఎక్కువ మాట్లాడ్డం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన వెంటనే ఎడ్జెస్ట్ అయిపోయారు. సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరధ్వాజ్ లాంటి వాళ్లు సర్దిచెప్పారు. ఆ ఇష్యూ అక్కడితో క్లోజ్ అయిపోయింది."

బాలయ్య ఆవేశంతో మాట్లాడారు కాబట్టి ఆ వ్యాఖ్యల్ని పట్టించుకోవాల్సిన అవసరం  లేదని నాగబాబు అనడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నిజంగా బాలయ్య ఏదో కోపంలో, ఆవేశంతో భూములు పంచుకున్నారంటూ అనేస్తే.. ఆ మాత్రం దానికి నాగబాబు అంత వైల్డ్ గా అప్పట్లో రియాక్ట్ అవ్వడం ఎందుకు?

అప్పుడు ఘాటుగా స్పందించి, ఇప్పుడు అబ్బేం బాలయ్య ఆవేశంలో ఏదో మాట్లాడారంటూ సర్దిచెప్పితే ఏం అర్థం. నాగబాబు మాటల్లోనే చెప్పాలంటే "అంతా సర్దుకున్నట్టేగా"! అందరూ "ఎడ్జెస్ట్" అయినట్టేగా!

చెప్పినదానికన్నా ఎక్కువ చెయ్యడం మా బలహీనత

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?