Advertisement

Advertisement


Home > Movies - Movie News

స్టెప్పులిర‌గ‌దీసిన బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్

స్టెప్పులిర‌గ‌దీసిన బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్

బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్ సుమ అని అంద‌రికీ తెలుసు. మాట‌ల వాగ్ధాటితో తెలుగు ప్రేక్ష‌కుల విశేష ఆద‌ర‌ణ అందుకుంటూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. సుమ అంటే ఇంటి మ‌నిషిలా ఫీల్ అయ్యేంత‌గా ఆమె బుల్లితెర‌పై త‌న న‌ట‌న‌తో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు.

బుల్లితెర‌పై సుమ క‌నిపించ‌ని రోజంటూ ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదు. లాక్‌డౌన్ విరామంలో షూటింగ్‌లు బంద్ కావ‌డంతో ఆమె ఇంటి ప‌ట్టునే ఉంటూ అబిమానుల్ని అల‌రించేందుకు సోష‌ల్ మీడియాను వేదిక‌గా ఎంచుకున్నారు. కామెడీ సిరీస్‌, వంటల వీడియోల‌ను త‌న యూట్యూబ్ చాన‌ల్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌లోడ్ చేస్తూ సుమ బిజీగా ఉన్నారు.

అల్లు అర్జున్ న‌టించిన అల వైకుంఠపురం సినిమాలోని రాములో రాములా పాట ఎంత‌గా పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సామాన్య జ‌నం సైతం అల‌వోక‌గా పాట‌ను ఆల‌పిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.  ఈ పాటకు క్రికెటర్‌ డెవిడ్‌ వార్నర్‌ తన భార్యతో కలిసి స్టెప్పులేయ‌డం మొద‌లుకుని అనేక మంది సెలబ్రిటీలు భాష‌, ప్రాంతాల‌తో సంబంధం లేకుండా డ్యాన్స్ చేస్తూ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఇదే పాటకు అంద‌రి అభిమాన యాంక‌ర్ సుమా కనకాల కూడా ఇంట్లో స్టెప్పులేశారు. ఎలాంటి మేకప్‌ లేకుండా మల్లెపూలు పెట్టుకొని పంజాబి డ్రెస్‌లో చిందులేస్తూ అభిమానులకి వినోదం పంచారు.  ఆమెకు తోడుగా పెట్‌ కూడా ఉండ‌డం విశేషం.  ఈ వీడియో సోషల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది.

చెప్పినదానికన్నా ఎక్కువ చెయ్యడం మా బలహీనత

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?