‘నాగ చైతన్య-శోభిత’ వైరల్ పిక్!

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఈ మధ్య త‌రుచు వార్తల్లో ఉంటూనే వున్నారు. వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గ‌తంలో వీరు ఇరువురు క‌లిసి హాలిడేకి…

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఈ మధ్య త‌రుచు వార్తల్లో ఉంటూనే వున్నారు. వాళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గ‌తంలో వీరు ఇరువురు క‌లిసి హాలిడేకి వెళ్ల‌ర‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. తాజాగా వీరికి సంబంధించిన మ‌రో ఫోటో వైర‌ల్ అవుతోంది.

చైతూ, శోభితా ధూళిపాళ లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో అక్కడ చెఫ్ సురేందర్ మోహన్ నాగ చైతన్యతో ఫోటో దిగారు. సురేందర్ ఆ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటో బ్యాగ్రౌండ్ లో టేబుల్ వద్ద శోభిత తన మొఖం కనిపించకుండా.. చేయి అడ్డుపెట్టుకొని ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఆమె శోభితానే అని కన్ఫర్మ్ చేస్తున్నారు. 

కాగా శోభిత, అడివి శేష్ తో రెండు సినిమాల్లో  'గూఢచారి' మరియు 'మేజర్' లలో హీరోయిన్ గా చేసింది. ఓ వైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతోంది. ఇక నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’ సినిమాలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు వెంకట ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.