ఏపాటి వాడికైనా.. అసూయ పడటం పరిపాటే- నాగబాబు

ఇవాళ దసరా పండుగ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లో నిర్వహించిన అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మంలో చిరంజీవిపై ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేసిన ప్ర‌ముఖ ఆధ్యాత్మికవేత్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావుపై నాగబాబు ట్విట్టర్…

ఇవాళ దసరా పండుగ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లో నిర్వహించిన అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మంలో చిరంజీవిపై ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేసిన ప్ర‌ముఖ ఆధ్యాత్మికవేత్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావుపై నాగబాబు ట్విట్టర్ వేదిక‌గా కౌంట‌ర్ ఇచ్చారు.

'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే ..' అంటూ ట్విట్టర్ వేదిక‌గా త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. గ‌రిక‌పాటి వయస్సు కూడా చూడకుండా వాడు వీడు అనడంతోనే నాగ బాబు సంస్కారం ఎలాంటిదో  ఆర్ధం చేసుకోవ‌చ్చు. అప్ప‌ట్లో కూడా కోట శ్రీనివాస్ పై నాగబాబు అనుచిత వ్యాఖ్యలు చేయ‌డం తెలిసిందే.  

అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణానికి చిరంజీవి రాగానే.. ఆయనతో, ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు పోటీపడ్డారు. అడిగిన వారందరికీ సెల్ఫీలు ఇస్తూ చిరంజీవి అక్కడే కాసేపు గడిపారు. అయితే, ఆ సమయంలో వేదికపై గరికపాటి ప్రసంగిస్తున్నారు. అంద‌రూ చిరంజీవి వైపే చూస్తుండటంతో సభలో కాస్త అంతరాయం ఏర్పడింది. దీంతో గరికపాటి కల్పించుకొని.. ‘చిరంజీవి గారూ.. ఆ ఫొటో సెషన్ ఆపకపోతే, నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతా’ అని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

చిరంజీవి గారు గ‌రిక‌పాటి వ్యాఖ్య‌లు పెద్ద‌గా ప‌ట్టించుకొక‌పోయిన మీడియాలో అటెన్షన్ కోసం నాగ‌బాబు ప‌దే ప‌దే అన‌వ‌స‌రంగా నోరు పారేసుకుంటున్నార‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. జ‌న‌సేన ప్ర‌చారం కోసం నెల‌లో ఒకసారి ఆంధ్రకు వ‌చ్చి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ‌టం త‌ర్వాత ట్విట్టర్ వేదిక‌గా ట్వీట్ లు చేసుకుంటు ఉండ‌టం నాగ‌బాబుకు ప‌రిపాటిగా అయిన‌ట్లు క‌న‌ప‌డుతోంది.