Advertisement

Advertisement


Home > Movies - Movie News

హవ్వ.. సొంత పార్టీ పేరు మరిచిపోయిన నాగబాబు

హవ్వ.. సొంత పార్టీ పేరు మరిచిపోయిన నాగబాబు

అవకాశం వస్తే రాజకీయాలు చేస్తా, లేకపోతే టీవీ షోలు చేసుకుంటా అనే రకం నాగబాబు. ఈ విషయం నేరుగా మొహం మీద చెబితే ఆయన ఇగో హర్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఓ లైవ్ షోలో.. తాను సీరియస్ పొలిటీషియన్ కాదు, సీజనల్ పొలిటీషియన్ అనే విషయాన్ని నాగబాబు తనకు తానుగా చెప్పుకున్నట్టయింది. మీడియా వేదికగా నాగబాబు, తన సొంత పార్టీ పేరు మరిచిపోయారు. జనసేన పేరు గుర్తుకు రాక తలపట్టుకున్నారు.

తమ్ముడు పెట్టిన పార్టీ.. తను ప్రచారం చేసిన పార్టీ.. తను స్వయంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ.. అలాంటి పార్టీ పేరుని నాగబాబు మరిచిపోయారు. జనసేన పేరు గుర్తుకురాక లైవ్ లోనే తడబడ్డారు. మా ఇంట్లో కల్యాణ్ బాబుకు ఓ పార్టీ ఉంది అంటూ జనసేన పేరును వెంటనే చెప్పలేక నీళ్లు నమిలారు. ఒక దశలో పార్టీ పేరు గుర్తుకురాక తలకొట్టుకున్నారు కూడా. ఈ గ్యాప్ లో ప్రకాష్ రాజ్ నవ్వు చూడాలి. అదే డిస్కషన్లో ఉన్న ప్రకాష్ రాజ్.. సహజ నటన ప్రదర్శించి సైలెంట్ అయిపోయారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కి చిరంజీవి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అటు మంచు విష్ణు కూడా సీరియస్ గానే మా అధ్యక్ష  పదవి కోసం ట్రైచేస్తూ.. ఇండస్ట్రీలోని అన్ని పెద్ద కుటుంబాలను టచ్ చేస్తున్నారు. ఈ దశలో ప్రకాష్ రాజ్ కి మద్దతుగా మీడియా డిస్కషన్లో కూర్చున్నారు నాగబాబు. సినిమా కుటుంబం అంతా ఒకటే, కానీ కుటుంబ సభ్యులకు వేర్వేరు అభిప్రాయాలుంటాయని చెప్పాలనుకున్నారు. ఆ క్రమంలో మా ఇంట్లో కూడా అప్పట్లో అన్నయ్య కాంగ్రెస్, తమ్ముడు జనసేన అనబోయి తడబడ్డారు.

గ్యాప్ మరీ అంత ఎక్కువైందా..?

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురవడంతోపాటు, మెగా బ్రదర్స్ కూడా చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఒకటి రెండు మీటింగ్ లకు నాగబాబు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ లైమ్ లైట్ లోకి రాలేదు. 

ఓ సారి ట్విట్టర్లో గాడ్సే గురించిన వేసిన ట్వీట్ తో నాగబాబుకి, పవన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అన్నయ్య ఇగో బాగా హర్ట్ అయింది, తమ్ముడి జోలికి, తమ్ముడి పార్టీ జోలికి అసలు రాలేదు. ఈమధ్య గ్యాప్ బాగా ఎక్కువైందేమో.. అసలు జనసేన అనే పేరే మరచిపోయారు నాగబాబు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?