బంధుప్రీతి అనేది ఓ కుళ్లుబోతు మాట

టాలీవుడ్ లో ఎక్కువమంది హీరోలు ఉన్న కుటుంబం మెగా కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఉన్నంతమంది హీరోలు మరే కుటుంబం నుంచి లేరు, రారు. కొడుకులే కాదు, అల్లుళ్లు కూడా హీరోలుగా మారిన చరిత్ర…

టాలీవుడ్ లో ఎక్కువమంది హీరోలు ఉన్న కుటుంబం మెగా కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఉన్నంతమంది హీరోలు మరే కుటుంబం నుంచి లేరు, రారు. కొడుకులే కాదు, అల్లుళ్లు కూడా హీరోలుగా మారిన చరిత్ర మెగా కాంపౌండ్ ది. దీన్నే అంతా నెపొటిజం లేదా బంధుప్రీతి అంటారు. అయితే ఇలా అంటే నాగబాబు ఒప్పుకోరు. కస్సుమంటారు. కష్టపడి పైకొచ్చామంటారు. హీరో అవ్వడం అంత వీజీగా అని ఎదురు ప్రశ్నిస్తారు.

నెపొటిజాన్ని గట్టిగా వెనకేసుకొచ్చారు నాగబాబు. మా పిల్లలు, మా ఇష్టం అంటున్న నాగబాబు.. వాళ్లకు సినిమా అవకాశాలు ఇవ్వకుండా గాలికి వదిలేయాలా అని ప్రశ్నిస్తున్నారు.

“అందరూ నెపొటిజం అంటున్నారని మా పిల్లల అవకాశాల్ని మేం చెడగొట్టాలా? బంధుప్రీతి అంటున్నారు కాబట్టి మా పిల్లలకు ఏం అవకాశాలు లేకుండా చేసి, మీ చావు మీరు చావండి అని వదిలేయాలా? ఓ డాక్టర్ కొడుకు డాక్టర్ అయితే బంధుప్రీతి అవ్వదా? ఓ లాయర్ కొడుకు లాయర్ అయితే నెపొటిజం అవ్వదా? డాక్టర్ కొడుకు డాక్టర్ ఊరికే అవ్వడు. కష్టపడి చదివితే అవుతాడు. ఇండస్ట్రీలో కూడా అంతే. కష్టపడితేనే హీరోలు అవుతారు? ఊరికే స్టార్ డమ్ వచ్చేయదు.”

ఇలా ఇండస్ట్రీలో నెపొటిజంను గట్టిగా వెనకేసుకొచ్చారు నాగబాబు. కొంతమంది వ్యక్తులు, మీడియా నెపొటిజం అంటూ ఊదరగొడుతున్నారని.. అవన్నీ కుళ్లుబోతుమాటలుగా కొట్టిపారేశారు.

“పెద్ద హీరో కుటుంబం నుంచి హీరో వస్తే ఎంత వరకు అడ్వాంటేజ్ అంటే.. ఏదైనా సినిమా అవకాశం ఈజీగా వస్తుంది. దీంతో పాటు ఫలానా హీరో కొడుకు అనే ఇమేజ్ పబ్లిక్ లో ఉంటుంది. కొంతమంది ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. 50 లక్షల మంది సినీప్రేక్షకులు ఉంటే అందులో లక్ష మంది మాత్రమే ఇలా వస్తారు. మిగతావాళ్లంతా రావాలంటే ఆ హీరో హిట్ అవ్వాల్సిందే.”

హీరోలంతా ఆ నాలుగు కుటుంబాల నుంచే వస్తున్నారనే వాదనను కొట్టిపారేశారు నాగబాబు. కష్టపడితేనే పరిశ్రమలో స్టార్ డమ్ వస్తుందంటున్నారు. తమ కొడుకుల్ని హీరోలుగా చేసుకోలేక చేతులెత్తేసిన హీరోలు-దర్శకులు చాలామంది తనకు తెలుసంటున్నారు నాగబాబు. 

ఎవరినీ వదిలి పెట్టను

అస‌లు ఈ సంవ‌త్స‌రం క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుందా?