టీడీపీ నడ్డి విరుస్తున్న జగన్…?

తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట ఉత్తరాంధ్రా అని అందరికీ తెలిసిందే. అటువంటి చోట టీడీపీ పుట్టిన ఇన్నేళ్ళ తరువాత తొలిసారిగా 2019 ఎన్నికల్లోనే  ఘోర పరాభవం ఎదురైంది. మూడు జిల్లాల్లో మొత్తం 34 సీట్లు…

తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట ఉత్తరాంధ్రా అని అందరికీ తెలిసిందే. అటువంటి చోట టీడీపీ పుట్టిన ఇన్నేళ్ళ తరువాత తొలిసారిగా 2019 ఎన్నికల్లోనే  ఘోర పరాభవం ఎదురైంది. మూడు జిల్లాల్లో మొత్తం 34 సీట్లు ఉంటే  కేవలం అరడజన్ మంది టీడీపీ  ఎమ్మెల్యేలు మాత్రమే  గెలిచారు. ఇక విజయనగరం జిల్లా అయితే ఒక్క సీటు టీడీపీకి దక్కకుండా వైసీపీ టోటల్ గా  ఊడ్చేసింది.

ఇపుడు విపక్షంలో ఉన్న టీడీపీని బాగా  వీక్ చేసేందుకు జగన్ రెడీ అయిపోయారు. మాజీ ఎమ్మెల్యేలతో పాటు, గట్టి పట్టున్న సీనియర్ నేతలకు వైసీపీ గేలం వేస్తోంది. వారంతా ఫ్యాన్ నీడకు చేరుకుంటున్నారు. నిన్నటివరకూ మాజీ మాంత్రి గంటా శ్రీనివాసరావుకు అతి ముఖ్య అనుచరుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, రూరల్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం అందులో భాగమే.

అంతే కాదు మరింతమంది మాజీలు, మేటి నాయకులు వైసీపీలోకి క్యూకడుతున్నట్లుగా సమాచారం. వీరిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉండే అవకాశం ఉందని టాక్. మొత్తానికి విశాఖ రాజధానిగా వద్దు అని చంద్రబాబు ఎంత గట్టిగా గొంతు చించుకుంటే అంతకు అంతగా ఉత్తరాంధ్రాలో టీడీపీ సీన్ చిరిగి చేట అవుతుందని తాజా రాజకీయ పరిణామాలు చెబుతున్నాయి. 

విశాఖ మీద ప్రేమ ఉన్న వారంతా ఇలాగే బాబుకు తమదైన మార్క్ పాలిటిక్స్ రుచి చూపిస్తారని అంటున్నారు. పంచకర్లతో ఇది మొదలుట, ముందుంది ముసళ్ళ పండుగ అని అంటున్నారు. చూడాలి మరి టీడీపీ కూశాలు కదిలించే సన్నివేశాలు మరెన్ని  జరుగుతాయో.

అస‌లు ఈ సంవ‌త్స‌రం క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుందా?

ఎవరినీ వదిలి పెట్టను