ప్రవీణ్ సత్తారు మరో సినిమా

చాన్నాళ్లుగా మరో ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ మధ్యనే సీనియర్ హీరో నాగార్జున తో ఓ ప్రాజెక్టు వార్తలు బయటకు వచ్చాయి. ఆ ప్రాజెక్టు అలా వుండగానే మరో…

చాన్నాళ్లుగా మరో ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈ మధ్యనే సీనియర్ హీరో నాగార్జున తో ఓ ప్రాజెక్టు వార్తలు బయటకు వచ్చాయి. ఆ ప్రాజెక్టు అలా వుండగానే మరో ప్రాజెక్టుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మెగా హీరో వరుణ్ తేజ్ తో ఓ పాజెక్టు డిస్కషన్ లోకి వచ్చినట్లు బోగట్టా.

వరుణ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న బాక్సర్ సినిమా తరువాత 14 రీల్స్ కు ఓ సినిమా చేస్తారని టాక్ వుంది. ఈ మధ్యనే ఆ సినిమా కోసం సాగర్ చంద్ర పేరు కూడా బయటకు వచ్చింది. ప్రవీణ్ సత్తారు కూడా 14 రీల్స్ కోసమే అని వినిపిస్తోంది. అంటే అయితే సాగర చంద్ర లేదా, ప్రవీణ్ సత్తారు ఇలా ఎవరో ఒకరితో వరుణ్ తేజ్ ప్రాజెక్టు ను సెట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయేమో? అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు ప్రాజెక్టులు ఫినిష్ చేయాల్సి వుంది. ఒకటి బాక్సర్. రెండవది ఎఫ్ 3. ఈ రెండు తరువాతే మరే ప్రాజెక్టు అయినా. బహుశా ఆ ప్రాజెక్టు కోసమే సాగర్ చంద్ర పేరు అయినా, ప్రవీణ్ సత్తారు పేరు అయినా వినిపించేది. 

ఎవరినీ వదిలి పెట్టను

అస‌లు ఈ సంవ‌త్స‌రం క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుందా?