పవన్ పక్కనే ఉంటారు. పవన్ తోనే ప్రయాణం అంటూ చెబుతుంటారు. సిసలైన జనసైనికుడ్ని అంటూ ప్రకటనలు గుప్పిస్తుంటారు. కట్ చేస్తే, ఎప్పటికప్పుడు పవన్ ను ఇరకాటంలో పెడుతుంటారు నాగబాబు. అప్పుడెప్పుడో చేసిన గాడ్సే వ్యాఖ్యల నుంచి మొన్నటికిమొన్న బన్నీపై చేసిన ట్వీట్ వరకు ప్రతి సందర్భంలో నాగబాబు వైఖరి పవన్ ను ఇరుకునపెట్టేలా ఉంటుందే తప్ప, మరోటి కాదు.
ఎన్నికల టైమ్ లో అల్లు అర్జున్ పై నాగబాబు ఇలా ట్వీట్ పెట్టి అలా డిలీట్ చేశారు. అలా రగులుకున్న చిచ్చు రావణకాష్టంలా ఇంకా కాలుతూనే ఉంది. అంతలోనే నాగబాబు మళ్లీ కెలికారు. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ట్వీటేశారు నాగబాబు.
“వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు, నాలాలు ఉప్పొంగి అపార్ట్ మెంట్స్ లోకి కూడా నీళ్లు రావడం, కొంతమంది ప్రాణాలు పోవడం చాలా బాధాకరం. వీటికి ముఖ్య కారణం చెరువుల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే. ఇప్పటికైనా అర్ధమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్. మన ముఖ్యమంత్రిని అందరం మెచ్చుకుందాం.”
నాగబాబు వేసిన ట్వీట్ సింపుల్ గానే ఉంది. ఆయన రేవంత్ రెడ్డిని ప్రశంసించడంలో తప్పు లేదు. అది ఆయనిష్టం. కాకపోతే ఆ ట్వీట్ పడిన టైమ్ కరెక్ట్ కాదు. చాలా రాంగ్ టైమ్ లో నాగబాబు ట్వీట్ వేశారనేది కొందరి వాదన.
ఎన్-కన్వెన్షన్ కూల్చివేతకు ముందు.. నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ కూల్చివేతకు ముందు నాగబాబు ఈ ట్వీట్ వేసి ఉంటే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కన్వెన్షన్ ను కూల్చేసిన తర్వాత పడిన ఈ ట్వీట్ ను చాలామంది వక్రీకరిస్తున్నారు. కన్వెన్షన్ కూల్చివేతను మీరు సమర్థిస్తున్నట్టేనా అంటూ కొంతమంది నాగబాబును ప్రశ్నిస్తున్నారు.
నిజానికి నాగబాబు ట్వీట్ అలానే ఉంది. హైడ్రాతో రేవంత్ రెడ్డి చేస్తున్న పనులకు తను పూర్తి మద్దతు ఇస్తున్నానంటూ ఆయన ట్వీట్ లో ఓపెన్ గా చెప్పారు. అంటే, ఎన్-కన్వెషన్ కూల్చివేతను ఆయన సమర్థించినట్టే. ఇది అక్కినేని అభిమానులకు కోపం తెప్పిస్తోంది.
ఇప్పటికే అల్లు అర్జున్ ఆర్మీ వెర్సెస్ పవన్ ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజ్ లో నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా అక్కినేని ఫ్యాన్స్ ను కూడా రెచ్చగొట్టేలా ఉన్నాయి నాగబాబు వ్యాఖ్యలు.
కరకట్టపై ఇదే ట్వీట్ వేయగలరా..?
అదే విధంగా ఏపీలో వర్షాలు, వరదలు మొదలవ్వకముందు నాగబాబు ఈ ట్వీట్ వేసినా బాగుండేది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా జోరుగా వానలు కురుస్తున్నాయి. ఊహించని విధంగా విజయవాడ, గుంటూరులో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. కరకట్టపై ఉంటున్న చంద్రబాబు నివాసానికి సమీపంలోకి నీళ్లు వచ్చి చేరాయి.
తెలంగాణలో చెరువుల్ని, నాలాల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తున్న నాగబాబు.. అదే మాటను కరకట్ట నిర్మాణాలకు సంబంధించి చెప్పగలరా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో ఎన్నో చెరువుల్ని, కరకట్ట ప్రాంతాల్ని ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని.. ఆ విషయంపై కూడా ట్వీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
“పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది, అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది”.. అంటూ మరో కొటేషన్ చేర్చారు నాగబాబు. దీనిపై కూడా సెటైర్లు పడుతున్నాయి. అమరావతి రాజధాని పేరిట వేల ఎకరాల వ్యవసాయ భూముల్ని చదునుచేసి, కాంక్రీట్ జంగిల్ లా మార్చబోతున్న వ్యవహారం దేనికిందకు వస్తుందో చెప్పాలని అడుగుతున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి, రెండు కాదు.. నాగబాబు ట్వీట్ చుట్టూ చాలా కోణాల్ని వెలికితీస్తున్నారు జనం. చివరికి మొన్నటికిమొన్న ఇంజనీరింగ్ కాలేజీలో బయటపడిన హిడెన్ కెమెరాల బాగోతంపై కూడా ప్రశ్నిస్తున్నారు. వాటిపై స్పందించడానికి తీరికలేని నాగబాబు, ఇప్పుడు ప్రకృతిని రక్షించమంటున్నారంటూ సెటైర్లు పడుతున్నాయి.
ఓవరాల్ గా ఇవన్నీ చుట్టూ తిరిగి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కే ఎఫెక్ట్ ఇవ్వడమనేది సహజం. ఆశ్చర్యరమైన విషయం ఏంటంటే, చివరికి పవన్ ఫ్యాన్స్ కూడా కొంతమంది నాగబాబుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆమధ్య కొన్ని రోజులు ఆయన సోషల్ మీడియాకు దూరమై, తిరిగొచ్చారు. అప్పుడే ఎందుకు వచ్చారంటూ ఫ్యాన్స్ ఆయన్ను ప్రశ్నించడం విశేషం.
ఏడుస్తున్నావ GA….. పాపం మన అన్నయ్య కూడా ఇలాంటి INSECURE ఏడుపు తోనే బాబాయ్, షెల్లెమాను దూరం చేసుకున్నాడేమో GA….😂😂
లో తుస్ పంది కి త్వరలోనే హైడ్రా నోటీసులు!
సాచ్చి ఎంప్లాయిస్ కి హారతి రోజూ కోడి గుడ్డు పఫ్ లు పంపకం పైనా విచారణ.
పాపం ప్రధానికి India (భారత్ కాదు) లో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో లేదో కూడా తెలియనంతగా కనులకు పొరలు కమ్ముకున్నట్లున్నాయి. ఇంత భారీ నష్టం జరిగితే aerial survey ఉండదు. సహాయ నిధి ప్రకటన ఉండదు.
పారాలింపిక్స్ లో క్రీడాకారుల్ని ప్రోత్సహించడంతోనే సమయం సరిపోతున్నట్లుగా ఉంది.
పాపం ప్రధానికి India (భారత్ కాదు) లో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో లేదో కూడా తెలియనంతగా కనులకు పొరలు కమ్ముకున్నట్లున్నాయి. ఇంత భారీ నష్టం జరిగితే aerial surveyy ఉండదు. సహాయ నిధి ప్రకటన ఉండదు.
పారాలింపిక్స్ లో క్రీడాకారుల్ని ప్రోత్సహించడంతోనే సమయం సరిపోతున్నట్లుగా ఉంది.
రాష్ట్రంలో అధికార-ప్రతిపక్షాలకు BJP ని స్పందించమని అడిగే ధైర్యం లేదు. ఈనాడు వెధవకేమో 100 రైళ్లు రద్దయినా కొత్తగా వందే sleeper వస్తుందని చొంగ కార్చుతాడు.
Call boy jobs available 8341510897
vc estanu 9380537747
vc available 9380537747
Shamshabad ninchi shad Nagar varaku evari hayam lo chadunu chesaru ??? Mari bhogapuram Kuda kinda nelana ? Avi pantalu pande bhoomi kava ?
Adavi narikethe nature ki chetu . Panta polalu matisthe thindiki karuvu
Titleki nee rathaki emannaa sanbandham vundaa g aaa…