కాస్టింగ్ కౌచ్ లేదు – బాలకృష్ణ

మలయాళ చిత్రసీమను కాస్టింగ్ కౌచ్ ఊపేస్తోంది. హేమ కమిటీ నివేదికతో చిత్రసీమ అట్టుడికిపోతోంది. అంతకంటే ముందు కాస్టింగ్ కౌచ్ పై ఓ పెద్ద ఉద్యమమే బయల్దేరింది. మధ్యలో టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్…

మలయాళ చిత్రసీమను కాస్టింగ్ కౌచ్ ఊపేస్తోంది. హేమ కమిటీ నివేదికతో చిత్రసీమ అట్టుడికిపోతోంది. అంతకంటే ముందు కాస్టింగ్ కౌచ్ పై ఓ పెద్ద ఉద్యమమే బయల్దేరింది. మధ్యలో టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు బయటకొచ్చాయి.

రాధికా ఆప్టే, తనుశ్రీ దత్తా, శ్రీరెడ్డి లాంటివాళ్సు టాలీవుడ్ లో కొంతమంది హీరోలపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. నేరుగా పేర్లు ప్రస్తావించనప్పటికీ, తెలుగు పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందన్నారు. ఆ తర్వాత మరింతమంది బయటకొచ్చారు.

అయితే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్నారు సీనియర్ నటుడు బాలకృష్ణ. అరుదుగా ఒకట్రెండు ఉదంతాలు జరిగి ఉండొచ్చు కానీ, ఓవరాల్ గా అలాంటివేం తన దృష్టికి రాలేదన్నారాయన.

“నాకు తెలిసి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదు. ఇలాంటివి ఏవైనా బయటకొచ్చినప్పుడు నేను అందరితో చాలా క్లోజ్ గా విచారిస్తుంటాను. ఏం జరుగుతోందని అడుగుతుంటాను. అరుదుగా ఒకటి, రెండు జరిగి ఉండొచ్చు. కానీ అవి కూడా జరగకూడదు. ఒకవేళ అలాంటివి జరిగితే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి ప్రత్యేకమైన దృష్టి పెడితే బాగుంటుంది.”

ఇలా కాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బాలకృష్ణ. హీరోయిన్లు తమ టాలెంట్ ను బయటపెట్టడానికి వస్తుంటారని, తమ నటనను నలుగురూ గుర్తించాలని ఆరాటపడుతుంటారని, అలాంటి వాళ్లను ఎంకరేజ్ చేయాలని అన్నారు బాలయ్య.

16 Replies to “కాస్టింగ్ కౌచ్ లేదు – బాలకృష్ణ”

  1. వీరప్పన్ ఎనుగులు వాటి సమ్రక్షన గురుంచి చెప్పితె ఎంత విన సొంపుగా వుంటుందొ

    గాలి జనర్దన్ రెడ్డి ..మట్టి దాని ప్రాముఖ్యత గురుంచి చెప్పితె ఎంత విన సొంపుగా వుంటుందొ

    KCR గాడు ఉమ్మడి కుటుంబం దాని ప్రాముఖ్యత గురుంచి చెప్పితె ఎంత విన సొంపుగా వుంటుందొ

    Jagan అవినితి వ్యతిరెక పొరాటం చెస్తె ఎలా వుంటుందొ

    నువ్వు క్యస్టింగ్ కౌచ్ గురుంచి మాట్లడితె అలా వుంటుంది

  2. అది దృష్టికి వస్తే close సర్కిల్ లో విచారణ చేస్తాడు ta. ఎందుకు? నా పేరు చెప్పార లేదా ana ?

Comments are closed.