సూర్య నటించిన కంగువా సినిమాను అక్టోబర్ 10కి విడుదల చేయాలనుకున్నారు. ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే రజనీకాంత్ నటించిన వెట్టైయాన్ సినిమాను కూడా అదే తేదీకి విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
దీంతో సూర్య వెర్సెస్ రజనీకాంత్ అంటూ కోలీవుడ్ లో చాలా కథనాలొచ్చాయి. నిజానికి రజనీకాంత్ రంగంలోకి దిగినప్పుడు మిగతా హీరోలంతా తప్పుకోవడం కామన్. ఇది ఓపెన్ సీక్రెట్. అయినప్పటికీ, ఈసారి సూపర్ స్టార్ కు పోటీగా సూర్య వస్తాడేమో అనే చర్చ నడిచింది.
ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాడు సూర్య. తన సినిమాను వాయిదా వేస్తున్నట్టు, రజనీకాంత్ సినిమాకు లైన్ క్లియర్ చేస్తున్నట్టు ప్రకటించాడు. వెట్టైయాన్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ తప్పుకున్నాడు.
“అక్టోబర్ 10న వెట్టైయాన్ వస్తోంది. ఆ సినిమాకు మనం కచ్చితంగా దారివ్వాలి. ఎందుకంటే అది రజనీకాంత్ సినిమా. ఆయన నాకంటే సీనియర్. నేను పుట్టినప్పట్నుంచి ఆయన నటిస్తున్నారు. 50 ఏళ్లుగా తమిళ సినిమాకు ఆయన చిహ్నంగా నిలుస్తున్నారు. నా సినిమా కంటే ముందు, సూపర్ స్టార్ సినిమా రావడం ఉత్తమమని భావిస్తున్నాను.”
ఇలా కంగువా సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు సూర్య. అయితే కొత్త విడుదల తేదీని మాత్రం అతడు వెల్లడించలేదు. దాదాపు వెయ్యి మంది రెండున్నరేళ్ల పాటు కష్టపడితే కంగువా తయారైందని.. తమ కష్టం ఎన్నడూ వృధాపోదని అన్నాడు.
నైస్ ట్రేడిషన్….
Call boy jobs available 8341510897
vc available 9380537747
మేం కూడా తప్పుకుంటాం థియేటర్ల నుండి
ఎలాగూ మేం థియేటర్లో చూడంలే