ప్రభాస్- మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమాలో చాలా సిజి షాట్స్ వున్నాయట. కానీ అలా అని సినిమా సగానికి సగం గ్రీన్ మాట్ సినిమానా అంటే కాదు. సినిమా హర్రర్ టచ్ తో కూడిన సబ్జెక్ట్ కావడంతో, సిజి కంటెంట్ అవసరం పడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సినిమా షూట్ చకచకా నడుస్తోంది. నవంబర్ నెలాఖరుకే షూట్ పార్ట్ పూర్తయిపోతుంది. కానీ సిజి పనులకు మాత్రం రెండు నెలలకు పైగా పడుతుందట. పైగా ఈ సిజి పనులు ఇండియా కంపెనీలకు కాకుండా ఇంటర్నేషనల్ కంపెనీలకు ఇస్తున్నారట.
అందువల్ల ఈ సిజి పనులు అన్నీ పూర్తి సంతృప్తిగా రెడీ కావడానికే కనీసం రెండు నెలల కాలం పడుతుందట. అది కూడా ఫాస్ట్ గా జరిగితే. లేదంటే ఇంకో నెల దాటినా దాటొచ్చు. అందుకే రాజాసాబ్ విడుదలను సమ్మర్ కు పెట్టుకున్నారు. నవంబర్ నుంచి ఎంత ఎక్కువ టైమ్ తీసుకున్నా సినిమా సమ్మర్ కు సులువుగా రెడీ అయిపోతుంది.
సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే నాలుగు పాటలు రెడీ అయినట్లు తెలుస్తోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ పాడుపడిన విల్లా సెట్ వేసారు. చుట్టూ అడవి బ్యాక్ డ్రాప్ సెట్ చేసారు.
Call boy works 8341510897
vc estanu 9380537747
అయినా మేం థియేటర్లో చూడం