నాగబాబు మాటల్లో అర్థాలు అనేకం!

ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి. ప్రభుత్వంలో కీలక వ్యక్తి. నాగబాబు తమ్ముడి వ్యవహారాలు చూస్తున్న కీలక నాయకుడు.

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా ద్వారా చేపడుతున్న కూల్చివేతలకు జనసేన నాయకుడు, సినీ నటుడు, ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉంటున్న నాగబాబు పూర్తి మద్దతు ప్రకటించారు. ‘రేవంత్ రెడ్డి గారి కాన్సెప్టు ఏమిటో ఇప్పటికైనా అర్థమైందా? రేవంత్ రెడ్డి గారి సాహసోపేత నిర్ణయాన్ని నిబద్ధతతో కూడిన చర్యలను మనమందరం అభినందిద్దాం.. మా సంపూర్ణ సహకారం మీకే’ అంటూ ఆయన అభినందించారు. నాగబాబు మాటలు కేవలం కూల్చివేతలకు మద్దతు మాత్రమేనా? అంటే లేదు, లేదు.. అందులో ఇంకా చాలా గూఢార్థాలు ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సాధారణంగా హీరో నాగర్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేశారు గనుక.. నాగార్జున రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డికి దగ్గరగా మెలిగే వ్యక్తి గనుక.. నాగబాబు ఇలాంటి సంతోషకరమైన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చునని ఎవరికైనా అనిపిస్తుంది. అయితే ఆ మాటలకు ఇంకా వేరే అర్థాలు కూడా ఉండొచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు నాలాలు ఉప్పొంగి అపార్ట్‌మెంట్ లలోకి కూడా నీళ్లు రావడం, సామాన్యుల ప్రాణాలు బలికావడం కూడా చూస్తున్నాం. ఇదంతా చాలా బాధాకరం. కొందరు చెరువులను నాలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు కారణం.. అని కూడా నాగబాబు వివరించారు.

అయితే రేవంత్ రెడ్డి స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వంలో కూడా ఇలాంటి చెరువులు, నదీ పరివాహక ప్రాంతాలు, నాలాల ఆక్రమించుకుని కట్టిన నిర్మాణాలను కూల్చేస్తారా? అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఎందుకంటే నాగబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి. ప్రభుత్వంలో కీలక వ్యక్తి. నాగబాబు తమ్ముడి వ్యవహారాలు చూస్తున్న కీలక నాయకుడు.

మరి ఏపీలో కూడా ఇలాంటి మంచి పని ప్రారంభించవచ్చు కదా.. అనేది పలువురి కోరిక. అలా ప్రారంభిస్తే గనుక.. మొట్టమొదటగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న కృష్ణానది ఒడ్డు మీద ఉన్న లింగమేనని ప్యాలెస్ ను కూలగొట్టాల్సి ఉంటుందని పలువురు అంటున్నారు. మరి నాగబాబు మాటల్లో చంద్రబాబు ఇంటిని కూల్చాలనే సంకేతాలు కూడా ఉన్నాయా అని కొందరు అనుమానిస్తున్నారు.

9 Replies to “నాగబాబు మాటల్లో అర్థాలు అనేకం!”

  1. రేపు ఇంకో ట్వీట్ వస్తుంది, నా మాటలు మీడియా వక్రీకరించింది అని. సింపుల్. వాడికి అసలు నిలకడ లేదు.

  2. ఇలాంటి పనికి మాలిన విషయాలు ఎక్కువ గా మాట్లాడే మీరు మిండ మోపులయ్యారు 24 లో .ప్రతి మాటకు పెదర్తాలు తీయడమే పని అయ్యింది రా సన్నాసులు

  3. లింగమనేని ప్యాలెస్ ని కులగొట్టాలి అని పలువురు అంటున్నరు ..ఎవరా పలువురు GA? నువ్వే అంటూ పలువురు అంటున్నారు అంటావేంటి?

    కానీ విని ఎరుగని వరదలు వచ్చిన అమరావతిలో నీరు లేదు చూశావా?

Comments are closed.