ప్రజాజీవిత ప్రస్థానం ఇలా కాదు జగన్.. ఇది పార్టీనా? కంపెనీనా?

కొందరు వ్యక్తుల ఉచ్చులో తాను ఉండిపోయి.. ఆ వ్యవస్థను సర్వనాశనం చేసే అధికారం జగన్ కు కూడా లేదు

రాజకీయ పార్టీ అంటే ఒక కార్పొరేట్ కంపెనీ కాదు! ప్రజాజీవితంలో, ప్రజలకు సేవ చేయడంలో తమను తాము పునీతుల్ని చేసుకునే ఒక తపస్సు. రాజకీయ నాయకులందరూ తపస్సు చేస్తున్న సర్వసంగ పరిత్యాగులు, రుషులు అని మన ఉద్దేశం కాదు. వర్తమాన వ్యవస్థలో అది సాధ్యం కూడా కాదు! రాజకీయ పార్టీ ద్వారా డబ్బు, అధికారం, హోదా, జీవితాంతం గుర్తుండిపోయే ఒక ప్రత్యేకమైన ‘కిక్’ ఇవ్వగల వాతావరణం.. ఇవన్నీ కూడా ప్రజాసేవ అనే లక్ష్యానికి అనుబంధ ఉత్పత్తులు. ఇలాంటి స్పృహ చాలా అవసరం.

ఈ స్పృహ మామూలుగా ఎమ్మెల్యేలో, మంత్రులో అయి, అక్కడితో తమ దందాలు చాలించాలనుకునే వారికి లేకపోయినా పర్లేదు. కానీ ఒక పార్టీని స్థాపించి.. రెక్కల కష్టంతో దానిని ఒక స్థాయికి తీసుకువెళ్లి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి.. ప్రజల హృదయాలలో ఒక ఆత్మీయుడిగా, రాష్ట్ర చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోవాలనుకునే వారికి ఆ స్పృహలేకపోతే చాలా కష్టం. జగన్మోహన్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజాజీవితంతో ముడిపడిన రాజకీయ పార్టీలాగా కాకుండా.. వ్యూహాలమీద మాత్రమే నడిచే కార్పొరేట్ కంపెనీలా మార్చేశారు. ఆయన పార్టీ పతన కారణాలలో ఇది కీలకమైనది! పార్టీ నిర్వహణ, దానిని ప్రజాదరణకు ప్రతీకగా నడిపే వ్యవస్థ ఆయనకు చేతకాలేదు. ఆత్మావలోకనం అవసరమైన ఈ సమయంలో జగన్ దృష్టి సారించాల్సిన అంశాలను తెలియజెప్పే ప్రయత్నం ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ప్రజాజీవిత ప్రస్థానం ఇలా కాదు జగన్.. ఇది పార్టీనా? కంపెనీనా?’!!

వైఎస్సార్ కాంగ్రెస్ అనేది జగన్మోహన్ రెడ్డి తాను స్వయంగా స్థాపించిన సొంతపార్టీ! అది ఆయన సొత్తు. దానిని ఆయన ఏమైనా చేసుకోవచ్చు. అలాంటి భావనతో వదిలేయడానికి అది ఒక ప్రెవేటు లిమిటెడ్ కంపెనీ కాదు. ప్రజలతో, వారి ఉద్వేగాలతో, వారి ఆదరణతో ముడిపడిన రాజకీయ పార్టీ! ప్రజల మనోగతానికి విలువ ఇవ్వకుండా, ప్రజలలో ప్రభావశీలురైన నాయకుల అభిప్రాయాలకు ఆస్కారమే ఇవ్వకుండా నడిపితే ఎలా ఉంటుంది? ఫలితం ఇప్పుడు మనం చూస్తున్నదే! కార్పొరేట్ కంపెనీల వ్యాపార వ్యవహారాలలో కేవలం వ్యూహాలకు మాత్రమే విలువ ఉంటుంది. వ్యూహాలే ఆ కంపెనీ వ్యాపారాన్ని నడిపిస్తాయి. వ్యూహాలే విజయాలను అందిస్తాయి.

కంపెనీలకు ప్రజలు అంటే కేవలం వినియోగదారులు మాత్రమే! రాజకీయ పార్టీకి అలా కాదు. ప్రజలు అంటే దేవుళ్లు. వారి సేవ చేసే అవకాశం కోసమే తాము పార్టీ పెట్టాం అనే స్పృహ ఉండాలి. వారు దీవిస్తేనే తమకు అధికారం దక్కుతుందనే ఆలోచన ఉండాలి. అలాంటిది ప్రజలను కూడా కేవలం వినియోగదారుడిగా మాత్రమే చూస్తూ.. కార్పొరేట్ వ్యాపారం ఏ రకంగా తాయిలాలతో ప్రజల్లో ‘కన్స్యూమరిజం’ పెంచుతుంటుందో.. అలా తాయిలాలతో మార్కెట్ చేసుకుంటూ, ప్రజల ఆదరణను ప్రేమను ‘ఎండ్ రిజల్ట్’గా పొందదలచుకుంటే అన్ని సందర్భాల్లోనూ అది సాధ్యం కాకపోవచ్చు.

జగన్ ఈ వ్యత్యాసాన్ని గుర్తించలేకపోయారు. అలా అనడం కంటె మరోలా అంటే బాగుంటుంది. ఈ వాస్తవాన్ని గుర్తించవలసిన సరైన సమయంలో జగన్ కనుల చుట్టూ భ్రమల పొరలు కమ్మి ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించడానికి ప్రజలు తనకు 151 సీట్లతో అందించిన అపూర్వమైన విజయం.. ప్రజల ఆశీర్వాదంగా, తనకు దక్కిన వరంగా ఆయన భావించలేదు. కేవలం ఐ-ప్యాక్ అనే ఒక సూడో మేథోసంస్థ వ్యూహాల చలవే అని అనుకున్నారు. విజయం దక్కిన తర్వాత కూడా ఐ ప్యాక్ ను నెత్తిన పెట్టుకున్నారు. సదరు సంస్థ జగన్మోహన్ రెడ్డికి ఒక మార్కెటింగ్ ఏజన్సీ లాగా పనిచేసింది. ఆ సంస్థ జగన్ ను, ఆయన రెక్కల కష్టం అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒక ‘కమోడిటీ’గా మార్చేసింది. మార్కెట్ చేయాలని అనుకుంది.

పాత రోజుల్లో సినీ నటులు ప్రజల్లో తిరుగుతూ ఉంటే.. ప్రజలకు కనిపిస్తూ ఉంటే వారి సినిమాలకు టికెట్లు తెగవని అనుకునే వారు. అవుట్ డోర్ షూటింగులు పరిమితంగా చేసేవారు. ఆ తరహాలో.. ముఖ్యమంత్రిగా జగన్ నిత్యం ప్రజలకు, ఎక్కడపడితే అక్కడ, కనిపిస్తూ ఉంటే ఆయన ‘మార్కెట్ వేల్యూ’ పడిపోతుందని పరిగణించి పరదాల మధ్య ఆయనను తిప్పారు. టీవీ ఛానెళ్లలో పెయిడ్ మార్కెటింగ్ స్లాట్స్ లో, కొన్ని చవకబారు ఉత్పత్తుల గురించి, వినియోగదారులు పదేపదే పొగిడే కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. ఆ తరహాలో.. ముఖ్యమంత్రి ప్రజలతో ఇంటరాక్ట్ అయి వారి అభిప్రాయాలు తెలుసుకునే కార్యక్రమాల్ని.. ‘స్క్రిప్టెడ్’గా, ‘ఫ్యాబ్రికేటెడ్’గా నిర్వహించారు. వారి వ్యూహాలే జిందా తిలిస్మాత్ అనుకున్న జగన్.. ప్రజాజీవితంలో తలలు పండిన ఎవ్వరి మాటలకు కూడా విలువ ఇవ్వలేదు.

ప్రజాజీవిత అనుభవం లేని, వ్యాపార దృక్పథం, కార్పొరేట్ కల్చర్ మాత్రమే ఉన్న కొందరు వ్యక్తులను మాత్రమే తన కోటరీగా చుట్టూ పెట్టుకున్నారు. ఆ కోటరీ అనేది ద్వారాలు, గవాక్షాలు లేని ఇనుపగోడల గదిలా మారిపోయింది. ఆ గోడలు పలికిన మాటలను మాత్రమే జగన్ విన్నారు. గోడల కళ్లతో మాత్రమే ప్రపంచాన్ని చూశారు. ఫలితమే పరాజయం. కానీ పరిపాలన చేతిలో ఉండగా అనుసరించిన విధానాలు అపభ్రంశమైనవని.. కోటరీ గోడలు బద్ధలు చేసుకుని బయటకు రాకపోతే.. ఎప్పటికీ తాను ఇలాగే, అదృష్టం మీద అధికారంలోకి వచ్చే నాయకుడిలాగే, మిగిలిపోతానని జగన్ ఇప్పటికీ గుర్తించడ లేదు.

మనం వృక్షంగా ఎదగగల ఒక మొక్కను నాటుతాం. రోడ్డు మీద వెళ్లే మేకలు, పశువులు దానిని తినేయకుండా దాని చుట్టూ ఒక ట్రీగార్డ్ ఏర్పాటు చేస్తాం. ఆ మొక్కకు కించిత్ ప్రమాదం జరగకుండా, వృక్షంగా ఎదగడానికి ఆ ట్రీగార్డ్ ఉపయోగపడుతుంది. కానీ.. మొక్క ఒక మోస్తరు వృక్షంగా ఎదిగిన తర్వాత.. ఆ ట్రీగార్డ్ ను తొలగించేయాలి. లేకపోతే మొక్క ఎదగకుండా ఇరుక్కుపోతుంది. ట్రీగార్డ్ తీసేస్తేనే పూర్తి ఎదుగుదల సాధ్యమవుతుంది. ఎన్నికలలో ఒకసారి అధికారంలోకి రావడానికి ఐప్యాక్ వ్యూహాలు అనేవి ఒక ట్రీగార్డ్ లాంటివని జగన్ గ్రహించలేదు. గెలిచిన తర్వాత కూడా అదే ట్రీగార్డ్ ఉచ్చులో ఉండిపోయారు.

లోతుగా గమనిస్తే.. ఐప్యాక్ ద్వారా లబ్ది పొందిన దేశంలోని ఇత‌ర పార్టీలు ఏవీ కూడా వారి సేవలను గెలిచిన తర్వాత కూడా కొనసాగించిన దాఖలాలు లేవు. ప్రధాని నరేంద్రమోడీ దగ్గరినుంచి, స్టాలిన్, మమతా అందరూ కూడా ఒకసారి వాడుకున్నారు. ఆ తర్వాత తాముగా దక్కిన విజయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు. జగన్ చేసిన పెద్ద పొరబాట్లు రెండు! కలకాలం వ్యూహాల మీదనే ఆధారపడాలని అనుకోవడం. అందుకు ఐప్యాక్ జిందా తిలిస్మాత్ అని నమ్మడం!

ఐప్యాక్ జిందాతిలిస్మాత్!

జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ను పార్టీ నడిపినట్టుగా నడపలేదు. ఐప్యాక్ కు దత్తత ఇచ్చారు. ఒక కాంట్రాక్టును సబ్ లీజుకు ఇచ్చినట్టుగా ఇచ్చారు. సేద్యం చేసుకునే ఓపిక ఆసక్తి లేని రైతు తన పొలాన్ని కౌలుకు ఇచ్చినట్టుగా ఇచ్చారు. కౌలుకు ఇస్తే ఇచ్చారు.. కానీ భూయజమాని అయిన రైతుగా కొంత అప్రమత్తంగా ఉండాల్సింది. కౌలుకు తీసుకున్న వాడు అందులో చేపల చెరువులే పెట్టాడో, సేద్యమే చేస్తున్నాడో గమనించలేదు. ఏం చేస్తే తనకేంటి? కౌలు కోరుకున్నట్టుగా గిట్టితే చాలనుకున్నారు. చివరికి నేలతల్లి చేవ చచ్చిన తర్వాత.. ఆ భూమి తిరిగి ఆయనకు విడిచిపెట్టి కౌలుదారుడు తుర్రుమన్నాడు. నష్టపోయింది ఎవరు?

జగన్ చేసిన ప్రధాన తప్పిదం.. తన వెంట నడుస్తున్న తన పార్టీ నాయకులను నమ్మకపోవడం. నాయకుల్ని ఆయన పూర్తిగా డమ్మీలుగా మార్చేశారు. ప్రజా సేవాకార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు అన్నింటికీ సంబంధించి నాయకుల పాత్ర లేకుండా చేశారు. వ్యవస్థలను మొత్తం ఐప్యాక్ చేతుల్లో పెట్టారు. వారు ఆడించినట్టల్లా తాను ఆడుతూ వచ్చారు. ఎన్నికలకు ముందు ఎలాంటి వ్యూహాలు అనుసరించి ప్రజల్ని బురిడీ కొట్టించాలో మాత్రమే అప్పటిదాకా అలవాటున్న ఐప్యాక్ కు ‘విజయం దక్కిన తర్వాత, చిరస్థాయిగా మిగిలిపోయే ప్రజాదరణను కూడగట్టడం ఎలాగ?’ అనే విషయంలో అనుభవం లేదు. అలాంటి అనుభవం సంపాదించుకోవడానికి ఐప్యాక్ బృందాలు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, పరిపాలనను ఒక ప్రయోశాలగా వాడుకున్నాయి.

మెడికల్ ట్రయల్స్ కు ఫార్మాకంపెనీలు వాడే ఎలుకల్లాగా, గినీ పిగ్ లలాగా జగన్ సర్కారును ఐప్యాక్ తమ ప్రయోగాలకు వాడుకుంది. ప్రయోగం వికటించింది. నష్టం ఐప్యాక్ కు రాలేదు. వందల కోట్ల వారి ఫీజుల్లో ఏమాత్రం కోతపడలేదు. జగన్ భవితవ్యమే అయోమయంగా మారింది.

పార్టీ నిర్ణయాలు ఎవరిచేతుల్లో..?

రాజకీయ పార్టీ అనేది ఒక వ్యవస్థగా వారి నిర్ణయాలు ఎలా ఉండాలి? సంస్థాగత కూర్పు ఎలా ఉండాలి? ఈ విషయాల గురించి జగన్ ఎన్నడూ పట్టించుకోలేదు. పార్టీ అంటే దానికి అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థ ఉండాలి. దానిని పాలిట్ బ్యూరో అనొచ్చు, సీడబ్ల్యూసీ అనొచ్చు పేర్లు ఏవైనా కావొచ్చు. కానీ.. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే ముందు నలుగురితో చర్చించి, మంచి చెడులు తర్కించి, లాభనష్టాలను బేరీజు వేసే వ్యవస్థ ఉండాలి.

జగన్ అధికారం వచ్చిన తర్వాత పార్టీని ఆ రకంగా నడిపారా? లేనే లేదు. ఇలాంటి ఒక అత్యున్నత విధాన నిర్ణాయక వ్యవస్థను పార్టీకోసం నిర్మించే క్రమంలో.. ప్రాంతాల వారీ, కులాలవారీ, మతాల వారీ సమతూకం పాటించడం కూడా చాలా అవసరం. పార్టీ అంటేనే ప్రజాజీవితం. మరి ప్రజలందరి, అన్ని వర్గాల వారి ప్రాతినిధ్యం పార్టీ నిర్మాణంలో ఉన్నదనే నమ్మకం అదే ప్రజలకు కలిగించలేకపోతే ఎలాగ? కానీ.. జగన్ వ్యవహార సరళి ఇలా సాగిందా? లేదు!

పార్టీ నిర్ణయాత్మకత కేవలం నలుగురు వ్యక్తుల చేతుల్లో ఉంది. వీరు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామక్రిష్ణా రెడ్డి, విజయసాయిరెడ్డి, ధనుంజయరెడ్డి! పార్టీకి వీరే నాలుగుస్తంభాలు, నాలుగు దిక్కులు! ఈ నిర్మాణాన్ని గమనిస్తే ఎవరికైనా ఏం అనిపిస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ అనేది ఒక ప్రెవేట్ లిమిటెడ్ కంపెనీ అనిపిస్తుందా లేదా? కీలక పదవులు బాధ్యతలు అన్నీ తన కులానికే చెందిన నలుగురి చేతుల్లో పెట్టేశారు. ఈ కీలక నిర్ణయాత్మక వ్యవహారాల్లో సగం రాష్ట్రానికి సంబంధించిన నాయకుల ప్రాతినిధ్యమే లేదు. అన్నింటికంటె ఘోరమైన విషయం ఏంటంటే.. ఈ నలుగురు నాయకులు కూడా ప్రజాజీవితం గురించి, ప్రజల్లో పనిచేయడం గురించి, వారి ఆదరణ సంపాదించడం గురించి కనీసజ్ఞానం కూడా ఉన్నవారు కానే కాదు!

వైవీ సుబ్బారెడ్డి సొంత బాబాయే అయినప్పటికీ.. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నంత కాలం రాజకీయాల జోలికి రాలేదు. ఆయన వారసుడిగా జగన్ పార్టీ స్థాపించగానే.. వైవీకి హఠాత్తుగా ప్రజానాయకుడి హోదా వచ్చేసింది. ప్రజల గురించి ఏమాత్రం తెలియకుండానే.. పార్టీని నడిపించెడి వాడు తానే అని ఆయన అనుకున్నారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా అంతే. చాలా పరిమితమైన జర్నలిస్టు కెరీర్ కలిగిఉన్న సక్సెస్ ఫుల్ వ్యాపారి ఆయన! ఆయన జర్నలిజం కెరీర్, వ్యాపారి జీవితాన్ని తక్కెడలో పెడితే.. హస్తిమశకాంతరం అనదగినంతటి తేడా ఉంటుంది.

ఇక విజయసాయిరెడ్డి విషయానికి వస్తే.. వ్యాపారులకు వక్రమార్గాలు నేర్పే ఆర్థిక వ్యూహకర్త ఆయన! పేదలు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజల రంగు రుచి వాసన కూడా తెలియని వ్యక్తి! ఆయన అత్యంత పార్టీ విధాన నిర్ణేతల్లో అత్యంత కీలకంగా మెలిగారు. ఇకపోతే.. ధనంజయరెడ్డి. పార్టీకి అవసరమైన అండగా ఆయన ఏమాత్రం ఉండగలిగారో గానీ.. కానీ జగన్ కోటరీలో కీలక వ్యక్తిగా తాను ఆర్థికంగా పరిపుష్టం అయిన ఫక్తు వ్యాపారి. పేదల ఊసు, కార్యకర్తల నాయకుల గోడు పట్టని కార్పొరేట్ వ్యాపారి. ప్రజల గురించి.. వారి కష్టాలు, వారి ఆదరణ పొందగల పద్ధతులు.. ప్రజలతో మమేకం కాగల నేర్పు తెలియని నలుగురు వ్యక్తులు సారథులుగా నడిచిన పార్టీ ప్రస్థానం ఇప్పుడు ఇలా ముగిసింది.

ప్రజల్లో ఉండే పార్టీ నాయకుల్ని ఈ నలుగురు తమ చుట్టూ తిప్పుకున్నారు. తమ తమ వ్యాపారాలను నిరాటంకంగా చేసుకున్నారు. చివరికి ఐప్యాక్ కూడా.. వైసీపీ లోకల్ లీడర్లను తమ మునివేళ్ల మీద ఆడించింది. చాలా మంది స్థానిక నాయకులు, ఎమ్మెల్యేల వద్ద అడ్డదారుల్లో డబ్బు తీసుకుని ఐప్యాక్ వారెవ్వరూ పనిచేయలేదని.. జగన్ గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా? ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అనే తమ నాయకుడు.. తమను, తమ ప్రజాదరణను నమ్మకుండా, తమ విన్నపాలను పట్టించుకోకుండా ఐప్యాక్ మీదనే పూర్తిగా ఆధారపడుతున్నారు గనుక.. ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా ఐప్యాక్ ప్రతినిధులకు భారీ తాయిలాలు సమర్పించుకుని.. తమ గురించి పాజిటివ్ నివేదికలు ఇప్పించుకున్నారనే వాదనను పార్టీ పెద్దలు కాదనగలరా? ఆ రకంగా స్థానిక నాయకులు పార్టీకి, అధినాయకుడికి క్రమంగా దూరం అయ్యారు.

పార్టీ నిర్వహణ ఎంత ఘోరంగా నడిచిందంటే.. తలశిల రఘురామ్ అనే వ్యక్తి చేతుల్లో పథకాల సభలు కార్యక్రమాలు ఉండేవి. వేదిక మీద ఎవరుండాలి? జగన్ పక్కన కుర్చీల్లో ఎవరుండాలి? అనేవి కూడా ముందుగానే డిజైన్, డిసైడ్ అయ్యేవి. కాకపోతే.. ఆ ‘జగన్ పక్క’ కుర్చీలకు పదినుంచి పాతికలక్షల వంతున ఒక రేటుండేది. అలా లబ్ధి పొందిన దళారీలు రాజ్యమేలిన పార్టీతో సాధారణ కార్యకర్త, సాధారణ నాయకుడు ఎలా? ఎప్పటికి మమేకం కాగలుగుతారు?

పార్టీ అధినేత అపాయింట్మెంట్లకు కూడా బ్లాకులో ధర నిర్ణయించిన పార్టీ బహుశా ఇదొక్కటే కావొచ్చు. అధినేత అపాయింట్మెంట్ల వ్యవహారం కృష్ణమోహన్ రెడ్డి, కెఎన్ఆర్ చూస్తారు. వారు అపాయింట్మెంట్లు ఇప్పించరు. ఒకసారి అడిగిన తర్వాత మళ్లీ ఫోను చేస్తే కనీసం లిఫ్ట్ చేయరు. స్పందించరు. అపాయింట్మెంట్ ఇప్పించరు! కనీసం అపాయింట్మెంట్ అడిగిన సంగతి అధినేత దృష్టికి తీసుకెళతారో లేదో కూడా తెలియదు. ఈ గోడు మొరపెట్టుకోడానికి మరో మార్గం కూడా గతిలేదు. నాయకుల వద్ద డబ్బు పుచ్చుకుని అపాయింట్మెంట్లు ఇప్పిస్తున్నారు.. అనే పుకారు పార్టీ వర్గాల్లోనే బాగా వ్యాపించినదంటే.. ఎవరు సిగ్గుపడాల్సిన సంగతి అది!?

కాస్త అతిశయంగా అనిపించిన మాటలు కొన్ని ఉన్నాయి. ‘వై నాట్ 175’, ‘ఇప్పుడు జరుగుతున్నది కురుక్షేత్ర సంగ్రామం.. రాష్ట్రంలో జరుగుతున్నది పెత్తందార్లకు, భూస్వాములకు- పేదవాళ్లకు మధ్య సమరం’ లాంటి నాటకీయమైన డైలాగులు పలికి జగన్మోహన్ రెడ్డి మురిసిపోయారు. ‘వారికి ఉన్నట్టుగా నాకు మీడియా లేదు, ఆస్తులు లేవు’ లాంటి మాటలు ఆయన చాలా తన్మయత్వంతో ఎన్నికల సభల్లో ప్రతి చోటా పలికారు. ఇవన్నీ కూడా ఐప్యాక్ వారి స్క్రిప్టు ప్రకారం పలికిన మాటలు!

అయితే ఇలాంటి వాస్తవ దూరమైన మాటలు వద్దే వద్దని, తమ పార్టీలో పేదలు ఎవరూ లేరనే సంగతి ప్రజలకు తెలుసు కదా, మనకు మీడియా ఉన్నదో లేదో ప్రజలకు తెలుసు కదా.. ఇలాంటి డైలాగుల వల్ల నవ్వులపాలు అవుతామని.. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు జగన్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఐప్యాక్, సజ్జల వంటి శక్తుల మాయలో ఉన్న జగన్ కు ఆ మాటలు చెవికెక్కలేదు. ప్రెస్ మీట్ లు పెడుతూ ప్రజలతో టచ్ లో ఉన్న భావన కలిగించాలని సీనియర్లు ఎందరు చెప్పినా జగన్ పట్టించుకోలేదు. చివరికి సజ్జల ఒక టీవీచానెల్ ఇంటర్వ్యూలో ‘జగన్ కు ప్రెస్ మీట్ పెట్టాలంటే భయం’ అని స్వయంగా చెప్పేశారు. బలహీనతను బయటపెట్టారు.

సర్వే బృందాలతో ఏం సాధించారు?

చెప్పుకోడానికి జగన్ ఐప్యాక్ మీద మాత్రమే కాకుండా, తన సొంత సర్వే వ్యవస్థల మీద కూడా ఆధారపడ్డారు. అయితే ఆ సర్వేలకు సారథ్యం వహించినది చెవిరెడ్డి భాస్కర రెడ్డి లాంటి.. ‘ప్రభుప్రీత్యర్థం’ పనిచేసే వ్యక్తులు. ఇంచుమించుగా పది రకాల సర్వే బృందాలతో జగన్మోహన్ రెడ్డి వివిధ దశల్లో నివేదికలు తెప్పించుకున్నారని అంటుంటారు. కానీ.. ఆ సర్వేలన్నీ చెవిరెడ్డి లాంటి వాళ్ల సారథ్యంలో.. జగన్ కళ్లలో ఆనందం చూడడానికి ఆ సర్వేలను ఫ్యాబ్రికేట్ చేసి, వండి వార్చాయని ఇప్పుడు అర్థమవుతోంది.

నిజానికి పార్టీ ఓటమి బాటలో ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి సర్వేల్లో పోపిడి తెలిసిందనే అనుకోవాలి. అయితే.. ఎక్కడెక్కడైతే అలాంటి పరాజయ సంకేతాలు నిజాయితీగా బయటకు వచ్చాయో.. అవన్నీ కూడా ఆయా ప్రాంత ఎమ్మెల్యేల వైఫల్యాల ఖాతాలో వేయడానికి జగన్ ప్రయత్నించారు. ఆయన ధోరణికి తగ్గట్టుగా.. ‘ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మరో ముప్ఫయ్యేళ్లపాటు సీఎం గా కోరుకుంటున్నారు.. కానీ అక్కడ ఎమ్మెల్యే గెలవడు’ అన్నట్టుగా నివేదికలు తయారయ్యాయి. వాస్తవం తెలుసుకోలేక. ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అటు ఇటు మారుస్తూ జగన్ గారడీ చేద్దామనుకున్నారు. ఐప్యాక్ ను నమ్మి ఆడిన ఆటలన్నీ బెడిసికొట్టాయి.

ఎంత దారుణం అంటే.. ఎన్నికల ముగిసిన తర్వాత ఒక పార్టీ అధినేత, ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు తమ పార్టీ కీలక నాయకులతో, జిల్లా సారథులతో, కనీసం ఎమ్మెల్యే అభ్యర్థులతో ఎవ్వరితోనూ సమావేశం కాలేదు. పార్టీ నాయకులందరూ కష్టపడి పనిచేసినందుకు వారికి కృతజ్ఞత చెప్పలేదు. ఒక విందు సమావేశం కాదు కదా.. కనీసం వారితో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదు. కానీ.. ప్రత్యేకంగా పనిగట్టుకుని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి.. ‘మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం’ అంటూ ప్రకటించి నవ్వులపాలయ్యారు.

తాను ఇచ్చే కూలి కోసం.. తన ఇష్టానికి తగినట్టుగా నివేదికలు తయారు చేసి తన పతనాన్ని శాసించిన ఐప్యాక్ బృందాల.. చప్పట్లు తాళాల మధ్య జగన్ మురిసిపోయారు. ఇలాంటి నాయకుడు కార్యకర్తలతో, కింది స్థాయి నాయకులతో మళ్లీ ఎప్పటికి మమేకం కాగలరు. ప్రతి కార్యకర్త కూడా ‘జగనన్న మనోడు’ అనుకునే వాతావరణాన్ని ఆయన ఎప్పటికి నిర్మించగలరు. ప్రజల్లో ఎలాంటి ఆదరణ మిగిలి ఉన్నదనే సంగతి తరువాత.. కనీసం.. పార్టీ కార్యకర్తలలో 2019 ఎన్నికలకు పూర్వం జగన్ పట్ల ఉన్న మమకారం, ప్రేమ, ఆదరణ ఇప్పటికీ అంతే స్థిరంగా ఉన్నాయని జగన్ గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా? అనేది సందేహం!

పార్టీ నిర్వహణకు వ్యవస్థీకృతమైన కొన్ని దారులు ఉంటాయి. ఆ దారిలోనే అందరూ వెళ్లాలి. అడ్డదారిలో లక్ష్యాన్ని అందుకోవడం కూడా కొన్ని సందర్భాలలో సాధ్యం కావొచ్చు. కానీ.. ఆ విజయానికి సస్టయినబిలిటీ ఉండదు. ఇప్పుడు జగన్ ఎదుర్కొంటున్న పరిస్థితి అది. పార్టీ అంటేనే కార్యకర్తలు అనే కనీస స్పృహలేకుండా జగన్ పరిపాలన సాగినకాలంలో ప్రవర్తించారు. అంతెందుకు ఇప్పుడు పార్టీ పునర్నిర్మాణం పేరుతో చిన్న చిన్న కసరత్తులు చేస్తున్నారు. కీలకమైన బాధ్యతల్లో ఒక ప్రాంతానికే చెందిన రెడ్డి సామాజిక వర్గం వారే కనిపిస్తుంటారు. అనుబంధ విభాగాల పేరుతో.. అన్ని వర్గాల వారికి తలా ఒక పదవి విదిలించినట్లుగా పంచుతున్నారు.

ఎంత దారుణం అంటే.. పార్టీ అనుబంధ విభాగాలకు సారథులుగా జగన్, వివిధ కులాలకు చెందిన, పలువురి పేర్లను ప్రకటిస్తే.. కనీసం వారిలో ఒక్కరు కూడా పార్టీ అధినేతకు ధన్యవాదాలు చెబుతూ ప్రకటన కూడా చేయలేదు. ఎందుకంటే.. వారందరికీ ఖచ్చితంగా తెలుసు.. అనుబంధ విభాగాల సారథులుగా తాము కాగితం మీద మాత్రమే కనిపించే డమ్మీలం మాత్రమే అని.. తమ చేతిలో ఏమీ ఉండదని!! ఇవాళ పార్టీనుంచి పలువురు చట్టసభల ప్రతినిధులే వెళ్లిపోతున్నారు. పదవులను కూడా వదులుకుని వెళుతున్నారు. వారందరూ స్వార్థపరులు, అవకాశవాదులు అని నిందించవచ్చు, అది నిజమే కావొచ్చు. కానీ.. తమకు జగన్ పదవులు ఇచ్చారే తప్ప పార్టీలో కూడా ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వలేదని, తమ పాత్ర లేకుండా చేశారని వారు చెబుతున్న ఆరోపణలు జగన్ ఖండించగలరా?

ఆయన ఖండించాల్సిన అవసరం లేదు. కనీసం ఆత్మసమీక్ష చేసుకోవాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన సొంత వ్యవస్థ. దాని మీద ప్రజలకు హక్కు ఉంది. ప్రజాజీవితంలో అధికారం కోరడం ద్వారా జగన్ ప్రజలకు ఆ హక్కును కట్టబెట్టారు. కొందరు వ్యక్తుల ఉచ్చులో తాను ఉండిపోయి.. ఆ వ్యవస్థను సర్వనాశనం చేసే అధికారం జగన్ కు కూడా లేదు. ఇది గ్రహించి జాగ్రత్త పడిన నాడు ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారు. లేకుంటే అదృష్టం తలుపు తడుతుందని యలహంకలో నిరీక్షించాల్సిందే.

.. ఎల్. విజయలక్ష్మి

70 Replies to “ప్రజాజీవిత ప్రస్థానం ఇలా కాదు జగన్.. ఇది పార్టీనా? కంపెనీనా?”

  1. అదృష్టము ఒకసారి కొడుతోంది తలుపు .. వన్ ఛాన్స్ ఓవర్ .. బాబు హామీలు నెరవేర్చాడు , అయినా పాలనా 14 ఏళ్ళు చూసి కూడా మళ్ళి అయినా బెటర్ అని తెచ్చుకున్నారు .. మరొక ఐదేళ్లు భరించలేని స్థితి లో ఉంది అన్న గారి పాలనా .. ..

  2. విజయలక్ష్మి ఇందులో సగం అయినా నీకు తెలుసు కదా, నువ్వు మీ greatandhra రాశారా..aho oho అనేకదా నీరు కూడా బ్యాండ్ మేళం కొట్టారు..మీకు ఇదే రాసే అర్హత ఉండా..జగన్ అభిమానులు గా ఉన్న nalantivallu ఇంకెప్పటికీ జగన్ నీ నమ్మరు..నువ్వు ఇంకా రేస్తుతీసుకో..చంబ వెదవ అయినా సరే నా ఓటు ఫ్యూచర్ లో టీడీపీ కే, వైసిపి కాదు ఎందుకంటే పోలిస్తే మ జగన్ కన్న చాలా బెటర్..ఇట్లు మోసపోయిన ఒక అభిమాని

  3. మీ.పాత్ర చెప్తా విన ంది. అన్ని అయి పాక్. సజ్జలా అంటున్నారు . మీరు అంత అమాయకులు కాదు . నీకు బాబు అపని అయిపోయింది అనిపించింది అసలు టీడీపీ అనే పార్టీ కూడా లేదు అని మీరు చాలా ఆర్టికల్స్ రాశారు కింద చాల మంది మద్దతు గా ఎగతాళి చేసారు . అధికారం కళ్ళకు తలకు ఎక్కింది మీకు . M B S ఒకసారి రాశారు అసలు టీడీపీ మాల్ల రాదు అని గ్రామీణ ప్రజలు అంత జగన్ నే ఇస్త పడుతున్నారు అని . ఇలా బోలెడు గత ఆర్టికల్స్ లో చూసం. యుద్ధం.ఓదాకా అందరు చెప్తారు వ్యూహం వివేకం అనేది యుద్ధానికి ముందు ఉండాలి తప్ప చేతిలోకి చిప్ప వచ్చాకా కాదు

  4. ఒక్కఆసారి మీ గత ఆర్టికల్స్ చూసుకోండి. మీరు మూర్తి గారు టీడీపీ ని పవన్ ను ఎంత ఎగతాళి చేసే వారో ఇప్పుడు యుద్ధం అయ్యాకా అందరు చెప్తారు

  5. సోది సరే కానీ..అభిమానులు గా మేము నిజాలు రాస్తే డిలీట్ చేసినవరెవరో కాస్త చెబుతావా..చెంబ మంచోడు కాకపోవచ్చు కానీ జగన్ కన్న లక్ష రెట్లు మేలు..ఇలా రాయాలంటే బాధ గా ఉంది కానీ నిజం అదే..అయినా ఓడిపోయాక కాదు..ముందు మీరెంత గుడ్డి గా సమర్ధించారు అనేది చూసుకోండి..కనీసం కామెంట్స్ డిలీట్ చేసే రోగాన్ని ముందు మీరు మార్చుకోండి తర్వాత వాడికి చెబుదురు కానీ. జగన్ని ఇంకోసారి రాయలసీమ వాళ్ళము నమ్మము..నువ్వు ఫిక్ ఐపో

  6. సరే కానీ..అభిమానులు గా మేము నిజాలు రాస్తే డిలీట్ చేసినవరెవరో కాస్త చెబుతావా..చెంబ మంచోడు కాకపోవచ్చు కానీ జగన్ కన్న లక్ష రెట్లు మేలు..ఇలా రాయాలంటే బాధ గా ఉంది కానీ నిజం అదే..అయినా ఓడిపోయాక కాదు..ముందు మీరెంత గుడ్డి గా సమర్ధించారు అనేది చూసుకోండి..కనీసం కామెంట్స్ డిలీట్ చేసే రోగాన్ని ముందు మీరు మార్చుకోండి తర్వాత వాడికి చెబుదురు కానీ. జగన్ని ఇంకోసారి రాయలసీమ వాళ్ళము నమ్మము..ఇది fix

  7. వాడిని నమ్మి మా రాయలసీమ సర్వ నాశనం ఐపోయింది..మేం ఇంకెప్పుడు వాడికి ఓటు వేయం

  8. పలి బిడ్డ అనుకున్నాం వాడు పిచ్చుక కన్న దారుణం..అహంకారం వెదవ కి బాగా జరిగింది

  9. ఏమీ మాట్లాడుతున్నావ్ రా భై, యుద్దం చేసి సొంత సైనికుల్ని చంపిన వీరుడు మా అన్న.

  10. Oka manchi chance miss chesukuntunnadu vijayawada varada bhadithulanu paramarshinchi ardhika sahayam , food avi andhisthe YCP inka brathike undi ani telusukuntaru akkada CBN 4 AM varaku varada pranthalani visit chesthu CM ela undalo chupistunnadu

  11. మొత్తానికి ఇజయలకిసిమి ‘సాగర సంఘమం’లో కల్లు త్రాగిన కోతి బావి మీద ‘పంచభూతములు ముఖపంచకమై’ అని నాట్యం ఎలా నేర్పాలో చూపినట్లు ఉంది.

  12. మా డా అన్నియ్య కి ఐదేళ్ళూ భజన చేస్తూ వా డిని మట్ట కుడిపే దాకా నిద్ర పోలేదు నువ్వు..ఇప్పుదు యేమైనా సుద్దులు చెప్తున్నావా?

    మీ అజెండా క్లియర్ గా అర్ధం అవుతుంది లే..సజ్జల సుబ్బా ధనంజయ పెద్ది చెవి రెడ్ల మీద ఇలా ప్రచారం చేసి వాళ్ళకి పొగ పెట్టి జగ్గ డి దగ్గర నీ గ్రిప్ పెంచుకొని ఎదో కీలక పదవి కి, కోట్ల రూపాయలకి గాలం వేస్తున్నావ్ కదా …

  13. మా డా అన్నియ్య కి ఐదేళ్ళూ భజన చేస్తూ వా డి ని మ ట్ట కుడిపే దాకా నిద్ర పోలేదు నువ్వు..ఇప్పుదు యేమైనా సుద్దులు చెప్తున్నావా?

    మీ అజెండా క్లియర్ గా అర్ధం అవుతుంది లే..సజ్జల సుబ్బా ధనంజయ పెద్ది చెవి రెడ్ల మీద ఇలా ప్రచారం చేసి వాళ్ళకి పొగ పెట్టి జ గ్గ డి దగ్గర నీ గ్రిప్ పెంచుకొని ఎదో కీలక పదవి కి, కోట్ల రూపాయలకి గాలం వేస్తున్నావ్ కదా …

  14. మా డా కి ఐదేళ్ళూ భజన చేస్తూ వా డిని మ ట్ట కు డి పే దాకా నిద్ర పోలేదు నువ్వు..ఇప్పుడు యేమైనా సుద్దులు చెప్తున్నావా?

    మీ అజెండా క్లియర్ గా అర్ధం అవుతుంది లే.. సజ్జల సుబ్బా ధనంజయ పెద్ది చెవి రె డ్ల మీద ఇలా ప్రచారం చేసి వాళ్ళకి పొగ పెట్టి జ గ్గ డి దగ్గర నీ గ్రిప్ పెంచుకొని ఏదో కీలక పదవి కి, కోట్ల రూపాయలకి గాలం వేస్తున్నావ్ కదా …

  15. రేయ్ గ్రేట్ ఆంధ్ర, కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో, నీ జలగన్న ఓటమి కి అన్ని ఊయ్న్నాయి.

    నువ్వు ఎదో ఐ ప్యాక్ మీద అసూయతో ఆర్టికల్ వ్రాసినట్లు వున్నది.

    పరిపాలన పరంగా ఏమేమి తప్పు లు chesaado అది గూడ వ్రాయి నిజాయతీగా .

    రాజధాని మార్చడం, ఇండస్ట్రీ లు తేవకపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడం, ప్రత్యర్థులను హింసించడం, పోలవరం లో ఫెయిల్ అవడం, బాబాయ్ కేసులో తప్పటడుగులు, అమ్మ చెల్లుళ్లను నిరాదరణ చెయ్యడం, బూతు మంత్రులను మైంటైన్ చెయ్యడం, ల్యాండ్ టిటిలింగ్ ఆక్ట్, ఇలా ఎన్నో కారణాలు వున్నాయి. వాటి గురించి కూడా వ్రాయి

  16. రేయ్ గ్రేట్ ఆంధ్ర, కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో, నీ జలగన్న ఓటమి కి అన్ని ఊయ్న్నాయి.

    నువ్వు ఎదో ఐ ప్యాక్ మీద అసూయతో ఆర్టికల్ వ్రాసినట్లు వున్నది.

    పరిపాలన పరంగా ఏమేమి తప్పు లు chesaado అది గూడ వ్రాయి నిజాయతీగా .

    రాజధాని మార్చడం, ఇండస్ట్రీ లు తేవకపోవడం, అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడం, ప్రత్యర్థులను హింసించడం, పోలవరం లో ఫెయిల్ అవడం, బాబాయ్ కేసులో తప్పటడుగులు, అమ్మ చెల్లుళ్లను నిరాదరణ చెయ్యడం, బూతు మంత్రులను మైంటైన్ చెయ్యడం, ల్యాండ్ టిటిలింగ్ ఆక్ట్, ఇలా ఎన్నో కారణాలు వున్నాయి. వాటి గురించి కూడా వ్రాయి

  17. జనం ఎప్పుడో నిద్ర లేచారు, 11 లెక్కన రెండు ఊత కర్రలు ఇచ్చారు మీ జగన్ కి వాటి సప్పోర్ట్ తో నడవమని, తమరికి మాత్రం ఇప్పుడు జ్నానోదయం అయింది, జగన్ పనికి రాడని ఆర్డమైంది. ఇంద్రుడు చంద్రుడు అని పొగిడావు అప్పుడు. అవి ఎలక బుర్ర వ్యాసాలు అని ఇప్పటికైనా అర్దం చేసుకో. మీ కన్నా సామాన్య జనం మిన్న. అప్పుడు మీరు తీసుకున్న పేమెంట్ దండగ మారి పేమెంట్, జనం డబ్బు తో జనం బుర్రలు మార్చడానికి విఫల ప్రయత్నం చేశారు , ఇప్ప్దు కడుపు లోది కక్కుతున్నారు.

  18. పాపం ఆవేశంలోనూ ఆవేదనలోనూ ఆక్రోషములోనూ ఆక్రందన గాను

    “ఐప్యాక్ గురించి ఒక నిజం చెప్పారు అదేంటంటే ప్రజల్ని బురిడీ కొట్టించి అధికారంలోకి ఎలా తీసుకురావాలో వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదని “

    కచ్చితంగా 2019లో ఏం జరిగిందో మేము చెబితే మీరు నవ్వారు ఇప్పుడు మీ నోటితో మీరే చెబుతున్నారు ఇప్పటికైనా తెలుసుకున్నందుకు ధన్యవాదాలు

  19. అనవసరం గా I PAK కి కోట్ల రూపాయలు ఇచ్చే బదులు… ప్రతి రోజూ ఈనాడు+ ఆంధ్ర జ్యోతి పేపర్ చదివి…జనాల నాడి ఎలా ఉందో తెలుసుకుని ఏడిస్తే….ఇప్పుడు ఈ ఏడుపులు ఉండేవి కాదు.. జగనన్న కు

  20. baga rasaru… vishayam straight ga…to the point annattu… okayana unnaru MBS ani… 8 rasaru additional sheets theskuni…. kani intha sooti ga cheppaleka… madya lo babu ni theskochi… mothaniki atu itu kakunda rasaru

  21. చంద్రబాబు మొనాటనీ పాలన తో విసుగొచ్చి.. వైఎస్ఆర్ కొడుకు, యువకుడు, మాట మీద నిలబడతా అంటున్నాడు, ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తాడు అని నమ్మి గోల్డెన్ ఇస్తే .. ఎంతసేపూ ప్యాలెస్ లో పండి కుట్రలు’ & కుత0త్రాలు చేస్తూ, ప్రతిపక్షాన్ని ప్రజలను వేధించిన

    ‘తిక్కలోడి పాపాల పాలన తో విరక్తి చెందిన ప్రజలు, కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కి కూడా పనికిరాని సన్నాసి, అంటూ Fan రెక్కలు మడత పెట్టి, వీడి గుడ్డలోకి 11 ఇంచులు దోపారు.

  22. One chance experiment is proved to be a BIG Failure

    చంద్రబాబు monatany పాలన కి బోర్ కొట్టి Jeggulu ఊరూరు తిరిగి ఇచ్చిన హామీలు మీద నమ్మకంతో ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రయోగం చేశారు.. కానీ ఆ ఒక్క ఛాన్స్ ని mis use చేసి పగ, ప్రతీకారం తో ప్రజల వాయిస్ఐన ప్రతిపక్షం లేకుండా చేసి, అప్పులు తెచ్చి పప్పులు పెంచితే, భూములు,సహజ వనరులు లూటీ చేసి, ఇసుక మధ్యం లో వేల కోట్లు కొట్టేసినా ప్రజలు చచ్చినట్టు తనకే ఓటుస్థారు ఆనుకున్నాడు yeర్రి యదవ ..

    అందుకే ఈడు కనీసం ప్రతిపక్ష నాయకుడు గా కూడా పనికిరాని సన్నాసి అని Fan రెక్కలు మడిచి గుడ్డ లో 11 ఇంచులు లోతుగా dengaaru ఐనా ఈడి కి బుద్ధి రావడం లేదు.. No body can help

  23. 11 రాక ముందు రాయాలి ఇలాంటి ఆర్టికల్స్ .. సవరం వచ్చేక వివరం వచ్చినా ఉపయోగం ఉండదు ga ..

  24. అక్కయ్యో, అక్కయ్య,

    ఏందమ్మ ఇది.

    గ్రేట్ ఆంధ్ర తెగ తెంపులు కి ముందు మాట నా ఇది.

    నిజమే, ఇన్నాళ్ళు ఏమి చేసినా కూడా సపోర్ట్ చేసినా కూడా (డబ్బు తీసుకునే అనుకో) ,

    ఇన్నాళ్లు వరసబెట్టి అడుక్కున్న కూడా, వెనకటి రెడ్డి వారికి ప్యాలస్ లో కి వెళ్ళడానికి కనీసం అపాయింట్మెంట్ కూడా దొరక్క పోవడం ( కాదు, ఇవ్వకపోవడం) అంటే ,ఎంత సిగ్గు లేని వాళ్ళకు కూడా చీ నాదేమి చె*త్త బతుకు అని అనిపించడం ఖాయం.

  25. ఏంబీస్ గారు ఇదీ చదివారు అంటే మీ ఆర్టికలే నీ డిలీట్ చేస్తారు. జాగ్రత్త.

    8 వ్యాసాలు రాసి, జగన్ శు*ద్ధ పూ*స, చాలా గొప్ప*వాడు అని సర్టిఫై చేస్తే, ఇప్పుడు మీరు ఆ*యన కి వ్యతిరేఖంగా జగన్ దే త*ప్పు రాస్తే , వారు మ*నసు క*ష్ట పె*ట్టుకుంటారు.

  26. వయసూకువయడ్. వయస్సు లో పెద్దైన చంద్రబాబు వరద నీటిలో తిరుగుతూ వుంటే,

    తన కంటే చిన్న వాడు అయిన జగన్ కి సొంత వ్యాపారాలు, డబ్బు వున్నాయి. తనింకా ఎక్కువగా ప్రజల్లో తిరిగితే కనీసం తనకి ఓట్లు వేసిన జనాల మధ్యలో అయిన తిరిగితే కనీసం కొంతెలో కొంత తనని నమ్మిన వాళ్ళకి సహాయంగా వుంటది.

    ఇంట్లో గమ్మున కూర్చుని అసలు ఏం చేస్తారో, అర్థం కాదు.

  27. వరదల టైమ్ లో ఇక్కడ వుంది తన కి చేతనైన సహాయం చేయకుండా విదేశాలకి హాలీడే కి వెళుతున్న ప్యాలస్ పులకేశి.

    కనీసం ఒక్క అన్నం పొట్లం అయిన పంచాడ, తన పార్టీ తరపున, వరద ప్రాంతం లో.

    చివరికి ఉద్యోగాలు లేని కుర్రవాళ్ళు కూడా తమకి చేతనైన సహాయం చేసున్నారు.

    వీడు ఒక పార్టీ నాయకుడు అంట. వీడికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే , అసెంబ్లీ కి వస్తాడు అంట.

    పెద్ద వే*స్ట్ గాడు.

  28. వరద*ల్లో జ*నాలు ఇ*బ్బంది పడు*తూ వుంటే, కనీసం తన పార్టీ తరపున ఒక్క అ*న్నం పొ”ట్లం కూడా పం*చలేదు, ప్యాలస్ పులకేశి.

    అలా పంచితే, గంజా*యి అమ్మి సంపా*దించిన డబ్బు తగ్గిపో*యిడ్డు అని భయ*పడ్డాడు ఏమో ప్యాలస్ పులకేశి.

    ఇప్పుడు , విదేశా*లకి హా*లీడే ట్రి*ప్ కి వెళుతు*న్నారు,

    వీడు ఒక పా*ర్టీ నాయకుడు నా, యా*క్ ఛి*.

  29. హాలిడే ట్రిప్ కి విద్దేశాలు కి వెళ్ళిన ప్యాలస్ పులకేశి

    ..

    వరదలో ప్రభుత్వానికి మించి, వాళ్ళకి పోటీగా తన సొంత డబ్బుతో తమకి సహాయం చేస్తాడేమోనని ఎదురుచూస్తున్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు..

  30. అది పార్టీ కాదు , అయన నాయకుడూ కాదు. 7th క్లాస్ స్టూడెంట్ కి ఉన్న IQ కూడా లేనివాడిని నాయకుడిని చేస్తే ఇంతే ఉంటుంది. అబద్దాలతో ఎల్లకాలం ప్రజలని మభ్యపెట్టలేరు.

Comments are closed.